Viral Video: గాళ్లోకి గన్​ఫైర్ చేసిన పెళ్లి కూతురు- వీడియో వైరల్​..

Viral Video: ఇంత వరకు పెళ్లి వేడుకల్లో పెళ్లి కొడుకు గన్​తో గాళ్లోకి కాల్పులు జరపడం చూశాం. తాజాగా ఓ పెళ్లి కూతురు ఏ మాత్రం భయం లేకుండా గన్​ ఫైర్​ చేసిన వీడియో వైరల్​గా మారింది. ఆ వీడియో మీరు చూసేయండి మరి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2022, 02:04 PM IST
  • పెళ్లి వేడుకల్లో భాగంగా పెళ్లి కూతురు గన్​ఫైర్​
  • గాళ్లోకి మూడు రౌండ్ల కాల్పులు
  • ఇంటర్నెట్​లో వీడియో హల్​చల్​
Viral Video: గాళ్లోకి గన్​ఫైర్ చేసిన పెళ్లి కూతురు- వీడియో వైరల్​..

Viral Video: ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకలను వినూత్నంగా జరుపుకోవడం ట్రెండ్​గా మారింది. పెళ్లి దుస్తుల్లోనే స్టెప్పులేయడం.. పెళ్లికి వెరైటీగా ఎంట్రీ ఇవ్వడం వంటివి చూశాం. ఇలాంటి ప్రయత్నాల్లో కొన్ని విఫలమై, మరికొన్ని సక్సెస్​ అయ్యి వైరల్​గా మారిన విషయం తెలసింది. అయితే కొంత మంది పెళ్లిలో ప్రత్యేకతకోసం మరింత వింత వింత పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఉత్తర భారతంలో పెళ్లిలో గన్ ఫైర్ చేయడం సర్వసాధారణ సంప్రదాయంగా జరిగే ప్రక్రియ. ఇది చట్ట రిత్యా నేరమైనప్పటికీ.. చాలా మంది అలాంటి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనల కారణంగా కొంత మంది ప్రాణాలు కోల్పోయిన విషయం కూడా తెలిసిందే.

అయితే తాజాగా ఇలా పెళ్లిలో గన్​ ఫైర్​కు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్​లో వైరల్ అవుతోంది. ఇంతకు ముందున్న వాటితో పోలిస్తే ఈ వీడియో కాస్త ప్రత్యేకం ఎందుటం.. గతంలో ఇలాంటి వీడియోల్లో ఎక్కువగా పెళ్లి కొడుకులు గన్ ఫైర్ చేయడాన్ని చూశాం.. కానీ తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ పెళ్లి కూతురు గన్ ఫైర్ చేసింది.

గన్​ను పట్టుకునేందుకే చాలా మంది బయపడుతుంటే.. ఈ వీడియోలో మాత్రం పెళ్లి కూతురు వెంటవెంటనే మూడు రౌండ్లు గాళ్లోకి కాల్పులు జరిపింది. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఆ పెళ్లి కూతురు గన్​ ఫైర్ చేస్తున్నప్పుడు ఏమాత్రం బయపడలేదు. గన్​ వాడటం బాగా అలవాటు ఉన్నట్లు ఫైర్ చేయడం గమనార్హం.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Deepesh Thakur (@deepesh966)

ఈ వీడియోను దీపేశ్​966 అనే ఇన్​స్టాగ్రామ్​ ఐడీలో షేర్ చేయగా.. 67,454 మందికిపైగా లైక్​ కొట్టారు. వందలాది మంది కామెంట్స్ చేశారు. లక్షలాది మంది చూసి ఈ వీడియో.. ఎక్కడ జరిగింది అనేది మాత్రం తెలియరాలేదు.

Also read: Ponytail Ban: ఆ ప్రాంతంలో పోనీటెయిల్స్ నిషేధం.. అమ్మాయిలు అలాంటి లోదుస్తులే వాడాలి!

Also read: Lion Vs Buffalo Funny Video: గేదెలకు భయపడి చెట్టు ఎక్కిన మృగరాజు- వీడియో వైరల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News