China Viral Video: జలపాతం నుంచి కొండరాళ్లపై జారి పడిన వ్యక్తి, వీడియో చూస్తే ఒళ్లు జలదరింపే

China Viral Video: పెద్ద కొండరాళ్లు..పైనుంచి పడుతున్న జలపాతం. పైనుంచి కిందివరకూ అంతా కొండరాళ్లే..ఆ జలపాతం నీళ్ల మీదుగా పైనుంచి కిందకు పడితే ఏమౌతుంది..ఒళ్లు జలదరిస్తోందా..అదే జరిగింది..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 20, 2022, 11:01 AM IST
China Viral Video: జలపాతం నుంచి కొండరాళ్లపై జారి పడిన వ్యక్తి, వీడియో చూస్తే ఒళ్లు జలదరింపే

China Viral Video: పెద్ద కొండరాళ్లు..పైనుంచి పడుతున్న జలపాతం. పైనుంచి కిందివరకూ అంతా కొండరాళ్లే..ఆ జలపాతం నీళ్ల మీదుగా పైనుంచి కిందకు పడితే ఏమౌతుంది..ఒళ్లు జలదరిస్తోందా..అదే జరిగింది..

థ్రిల్, అడ్వెంచర్ ముసుగులో అందులో ఉన్న ముప్పు సాధారణంగా కన్పించదు. చూసేవారికి మాత్రమే కన్పిస్తుంది. లేదా ఓసారి అనుభవిస్తే మరోసారి దాని జోలికెళ్లరు. అడ్వెంచర్స్‌లో ఎంత థ్రిల్ ఉంటుందో..అంతే రిస్క్ ఉంటుంది. అది ప్రాణాంకమైనప్పుడు మానేయడమే మంచిది. లేకపోతే ఇలాగే ఉంటుంది. అదృష్టం బాగుండి బతుకు జీవుడయ్యాడు గానీ లేకపోతేనా..

చైనాలోని సుసాంగ్ కౌంటీ ప్రాంతంలో జ్యూజింఘౌ పర్యాటక ప్రాంతమిది. పెద్ద పెద్ద కొండరాళ్ల పైనుంచి దిగువకు ఓ జలపాతం పడుతుంటుంది. ఇది నిషిధ్ద ప్రదేశమైనా..జనం వెర్రిగా వెళ్తుంటారు. జలపాతంపై నుంచి కిందివరకూ అంతా బండరాళ్లే. ఆ జలపాతంపై నుంచి నీటివాలుగా చేసుకుని కొందరు జారే ప్రయత్నం చేస్తుంటారు. ఇది అత్యంత ప్రమాదకరమని తెలిసినా సరే. అలాగే ఓ వ్యక్తి చేయబోయి..జారిపోయాడు. పై నుంచి ఓ వస్తువును కిందకు పాడేస్తే ఎలా బౌన్స్ అవుతూ కిందకు పడుతుందో అలా పడ్డాడు. కొండరాళ్లను ఢీ కొట్టుకుని తల భాగం లేదా దేహం ఛిద్రం అయిపోవల్సిందే. అదృష్టం ఎక్కడో రాసిపెట్టినట్టుంది..చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాడు.

ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వీడియో చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది. వీడియో చూసినవారెవరికైనా ఈ వ్యక్తి ప్రాణాలతో బయటపడడనే అనుకుంటారు. అంత భయంకరంగా ఉంటుంది. ఆ వ్యక్తికి ఎక్కడో సుడి ఉన్నట్టుంది. అందుకే గాయాలతో బతుకు జీవుడయ్యాడు. పర్యాటక ప్రదేశాల్లో ఉండే వార్నింగ్ బోర్డుల్ని పాటించాలని చెప్పేది అందుకే. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Also read: Viral Video: ఇదేందయ్యో ఇది.. ఇలాంటి చేపను ఎక్కడా చూడలే! ఊసరవెల్లిలా రంగు మార్చుతోంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News