Police help video : సమస్య కనిపిస్తే సాయం పక్కా.. పోలీసులు హెల్ప్‌ చేసిన వీడియో వైరల్

Police help video viral : పోలీసులు చేసిన హెల్ప్‌నకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూడండి.

Last Updated : Dec 21, 2021, 02:24 PM IST
  • ప్రజలకు అండగా నిలుస్తోన్న ఫ్రెండ్లీ పోలీసు
  • ప్రమాదాల్లో ఉన్నప్పుడు భరోసాగా నిలుస్తోన్న కాప్స్
  • పోలీసులు చేసిన హెల్ప్‌నకు సంబంధించిన వీడియో వైరల్
  • సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు
Police help video : సమస్య కనిపిస్తే సాయం పక్కా.. పోలీసులు హెల్ప్‌ చేసిన వీడియో వైరల్

Cops help remove car stuck on the road video posted Telangana State Police : ప్రమాదాలైనా.. పండగలైనా.. ఎక్కడైనా సరే పోలీసులే ముందుంటారు. ఫ్రెండ్లీ పోలీస్ స్టిస్టమ్‌ వచ్చాక ఖాకీలు ఎన్నో సహాయాలు చేయడం స్టార్ట్ చేశారు. తప్పు చేస్తే శిక్షించే పోలీసులు.. ప్రమాదాల్లో ఉన్నప్పుడు రక్షించడంలోనూ‌‌ ముందుంటున్నారు. ఏ ఆపద వచ్చినా తాము ఉన్నామంటూ భరోసా ఇస్తున్నారు. చాలా మంది పోలీసులు (Police) జనాలతో శభాష్ అనిపించుకుంటున్నారు. 

పోలీసుల సేవలను పొగుడుతూ ఎన్నో పాటలు, వీడియోలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు పోలీసులు చేసిన హెల్ప్‌నకు (Help) సంబంధించిన ఒక వీడియో (Video) సోషల్ మీడియాలో (Social media) వైరల్ (Viral) అవుతోంది.

అసలు ఆ వీడియోలో ఏముందంటే.. ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి కారులో బయటికి బయల్దేరుతారు.. తర్వాత రోడ్డుపై సడెన్‌గా కారు ఆగిపోతుంది. అందులో ఉన్న ఒక మహిళ, చిన్న పాప కారును ముందుకు తోసేందుకు ప్రయత్నిస్తారు. అంతకు ముందు రోడ్డుపై వెళ్లే వ్యక్తులను సాయం అడిగినా వారు సహాయం చెయ్యరు. కొందరేమో చూసుకుంటూ వెళ్లారు కానీ పట్టించుకోరు.

ఇక చివరికి అక్కడకు చేరుకున్న ఇద్దరు పోలీసులు కారును (police car) చెక్ చేసి.. దాన్ని ముందుకు తోస్తూ సాయం చేస్తారు. కారు స్టార్ట్‌ అవుతుంది. ఇక వారి ఆనందానికి అవధుల్లేవు...దేవుళ్ల మాదిరిగా వచ్చి మాకు హెల్ప్‌ చేశారన్నట్లు థ్యాంక్స్ చెప్తారు. ఇక ఈ వీడియోను తెలంగాణ స్టేట్‌ పోలీసు వారు (Telangana State Police) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read : Flipkart Bumper Offer: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 42 ఫోన్ కేవలం 5 వేలకే..మరి కొద్దిగంటలే

"సహాయం అవసరమని, అభ్యర్థించినా సరే సంబందం లేని వారికి నేనెందుకు సహాయపడాలనో, లేదా నా చేతులకు మట్టి అంటుకుంటుందనో చాలావరకు ముందుకు రాని జనం... ఇదీ ప్రస్తుత వైనం. అడిగినా.. అడగకపోయినా, ఎవరు ముందుకు వచ్చినా..రాకపోయినా, సమస్య కంటబడ్డ మరుక్షణం మీ సహాయర్థమై వాలిపోయే వాడొకడుంటాడు...వాడే ఖాకీ" అంటూ క్యాప్షన్ ఇస్తూ పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది..

 

Also Read : Senapathi: యాక్షన్, సస్పెన్స్‌లతో అదిరిపోయిన రాజేంద్రప్రసాద్ 'సేనాపతి' ట్రైలర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News