Snake Eats Snake: బతికున్న రాటిల్ స్నేక్‌ను మింగేసిన కాటన్‌మౌత్ స్నేక్‌.. వీడియో చూస్తే పోసుకోవడం పక్కా!

Viral Video, Big Cottonmouth swallowed Rattlesnake very easily. బతికున్న రాటిల్ స్నేక్‌ను కాటన్‌మౌత్ స్నేక్‌ సునాయాసంగా తినగలదు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 12, 2022, 08:23 AM IST
  • రాటిల్ స్నేక్‌ను మింగేసిన కాటన్‌మౌత్
  • వీడియో చూస్తే వణికిపోతారు
  • నేలపై పరుగెత్తగలవు, నీటిలో ఈద గలవు
Snake Eats Snake: బతికున్న రాటిల్ స్నేక్‌ను మింగేసిన కాటన్‌మౌత్ స్నేక్‌.. వీడియో చూస్తే పోసుకోవడం పక్కా!

Big Cottonmouth eats Rattlesnake very easily: 'కాటన్‌మౌత్'.. ఈ పేరును దాదాపుగా ఎప్పుడూ వినుండరు. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన పాము జాతులలో ఈ కాటన్‌మౌత్ ఒకటి. వీటిని 'వాటర్ మొకాసిన్స్' అని కూడా పిలుస్తారు. ఇవి ఆగ్నేయ యునైటెడ్ స్టేట్స్‌లో కనిపించే అత్యంత విషపూరిత పాములు. నోటి లోపలి భాగంలో తెల్లటి రంగు ఉండటం వలెనే వాటిని కాటన్‌మౌత్‌ అని పిలుస్తారు. బెదిరింపులకు గురైనప్పుడు మాత్రమే కాటన్‌మౌత్‌లు తమ నోటిని తెరుస్తాయి. ఆ సమయంలోనే నోటి లోపలి భాగంను మనం చూసే అవకాశం ఉంది. 

కాటన్‌మౌత్‌లు సెమీ ఆక్వాటిక్‌ (ఉభయచర జీవులు)గా ఉంటాయి. ఇవి నేలపై పరుగెత్తగలవు, నీటిలో ఈద గలవు. నీటిలో ఎక్కువ సమయం గడిపే ఏకైక విషపూరిత పాము ఇది. కాటన్‌మౌత్‌లకు స్థానిక పేర్లు చాలానే ఉన్నాయి. బ్లాక్ మొకాసిన్‌లు, గ్యాపర్‌లు, మాంగ్రోవ్ రాటెల్స్, స్నాప్ జవాస్, స్టబ్-టెయిల్ స్నేక్స్, వాటర్ మాంబాలు మరియు వాటర్ పైలట్‌లు అని అంటారు. అన్ని పిట్ వైపర్‌ల మాదిరిగానే కాటన్‌మౌత్‌లు కళ్ళు మరియు నాసికా రంధ్రాల ద్వారా మనుగడ కొనసాగిస్తాయి. ఇవి మనుషులను చాలా అరుదుగా కొరుకుతాయి. రెచ్చగొట్టినప్పుడు మాత్రమే కాటేస్తాయి.

కాటన్‌మౌత్‌లు ముదురు గోధుమ, నలుపు, ఆలివ్, బ్యాండెడ్ బ్రౌన్ లేదా పసుపు రంగుల్లో ఉంటుంది. ఇవి 2 నుండి 4 అడుగుల పొడవు ఉంటాయి. ఇవి క్షీరదాలు, పక్షులు, ఉభయచరాలు, చేపలు, పాములు, చిన్న తాబేళ్లు మరియు చిన్న ఎలిగేటర్లను తింటాయి. ఈ పాములు కాపర్ హెడ్స్ వంటి విషపూరితమైన వాటిని వేటాడేందుకు వెనుకాడవు. ఇతర జాతుల పాములను కూడా సునాయాసంగా పట్టేసి మింగుతుంటాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

 

Trending News