Snake Video Viral: ఆవుతో కోబ్రా దోస్తానా.. ఇకనైన ఆ కుళ్లు బుద్ది మానుకోవాలని నెటిజన్ల కామెంట్లు.. వీడియో వైరల్..

Viral video: చెట్ల మధ్యలో ఒక నాగు పాము ఆవు ముందరకు వచ్చింది. అప్పుడు ఆ ఆవు.. పామును చూసి  ఏ మాత్రం భయపడకుండా దాని మీద ప్రేమను కురిపించింది. ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 17, 2024, 05:23 PM IST
  • పామును నాకుతున్న గోమాత..
  • ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
Snake Video Viral: ఆవుతో కోబ్రా దోస్తానా.. ఇకనైన ఆ కుళ్లు బుద్ది మానుకోవాలని నెటిజన్ల కామెంట్లు.. వీడియో వైరల్..

snake and cow friend ship video: సాధారణంగా ఇటీవల కాలంలో మనుషులు కనీసం పక్కవాడిని పట్టించుకోలేనంత బిజీ అయిపోయారు. మరికొందరు ఒకడు బాగుపడితే.. వాడి మీద పడి ఏడ్వడం, ఎలాగ వాడ్ని కిందకు లాగాలో ఇలా ఆలోచిస్తున్నారు. పొరపాటున కష్టం వస్తే.. అక్కడకు అస్సలు పోరు. రోడ్డుమీద ఏదైన ప్రమాదాలు జరిగితే.. చూసుకుంటూ వెళ్లిపోతారు. కానీ ఒక్కనిముషం కూడా ఆగి ఏదైన సహాయం చేయడానికి అస్సలు ముందుకురారు.

కానీ కొన్ని సార్లు మనుషుల కన్నా.. మూగ జీవాలు తమ వారు ఆపదలో ఉంటే వెంటనే అక్కడికి వెళ్లి వాలిపోతాయి. ఒక కోతి చనిపోతే.. వందలాది కోతులు అక్కడకు చేరుకుంటాయి. ఒక కాకి లేదా మరేదైన జీవి అయిన తమ సాటి జీవి మీద ఎంతో ప్రేమతో ఉంటాయి.

 

అదే విధంగా.. పొరపాటున తమ వారి జోలికి ఇతరులు ఎవరైన వస్తే మూగజీవాలుదాడులు చేయడానికి సైతం వెనుకాడవు. అదే విధంగా కొన్ని సార్లు జంతువులు జాతీ వైరాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 

పూర్తి వివరాలు..

ఒక ఆవు పొలంలో పచ్చిక మేస్తుంది. మరీ అక్కడకు పాము వచ్చినట్లుంది. అసలైతే.. పాము చాలా విషపు జీవి. ఎవరైన దాని దరిదాపుల్లోకి వచ్చినట్లు అన్పిస్తే వెంటనే కాటు వేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. ఆవు మాత్రం.. ప్రేమతో పామును తన నాలుకతో నాకుతుంది.

అదే విధంగా పాము కూడా ఆవుకు ఎలాంటి అపకారం తలపెట్టకుండా.. అలానే ఉండిపోయింది. ఆవు, విష పూరీతమైన పామును సైతం ప్రేమతో లాలించడం ఇప్పుడు వైరల్ గా మారింది. నోరులేని జీవాలే .. అలా ఉంటే.. ఆలోచన చేేసే విఘ్నత ఉన్న మనుషులు ఏవిధంగా ఉండాలో.. అని ఈ వీడియో ఒక మంచి మెస్సెజ్ ఇస్తున్నట్లు తెలుస్తొంది. 

Read more:Diamond Snake Video: వావ్.. చమక్.. చమక్ చమ్కాయిస్తున్న డైమండ్ సర్పం.. వీడియో చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే..

దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం ఫిదా అవుతున్నారంట. ఒకరి మీద కుళ్లుకుంటూ ఉండే వాళ్లు ,  ఒకరి ఉన్నతిని చూసి ఓర్వలేని వాళ్లు  ఇప్పటి కైన మారాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారంట.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News