Viral Video: మెుసలి మరో మెుసలిని తినడం చూశారా? ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!

Viral Video: నెట్టింట జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మెుసలి మరో మెుసలిని తినే వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2021, 07:54 PM IST
Viral Video: మెుసలి మరో మెుసలిని తినడం చూశారా? ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!

Viral Video: అడవిలో క్రూర మృగాలు(Ferocious beasts) వేటాడకపోతే అవి తమ మనుగడను సాగించలేవు. ఒక్కోసారి తమ జాతి జంతువులనే చంపి తింటాయి. వాటికి దొరక్కుండా కొన్ని సాధు జంతువులు తప్పించుకు తిరుగుతాయి. ఈ మధ్య జంతువుల(Animals)కు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ కంటెంట్ ను జనాలు బాగా ఇష్టపడుతున్నారు. ఇదే కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ వీడియో చూస్తే మీ ఒంట్లో వణుకు పుట్టడం ఖాయం. 

నీళ్లలో మెుసలి(Crocodile)కి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. సముద్రపు అలెగ్జాండర్ గా పిలువబడే ఈ జంతువు ఎంతటి బలశాలో చెప్పాల్సిన అవసరం లేదు. నీళ్లలోకి ఏ జంతువైనా వస్తే ఇట్టే మట్టుబెట్టేస్తుంది. అయితే మనం ఎక్కువగా మెుసలి ఇతర జంతువులను వేటాడటం చూసి ఉంటాం. కానీ మెుసలి తన ఆహారంగా మరో మెుసలిని తినడం మీరెప్పుడైనా చూశారా? అయితే ఈ వీడియో(Viral Video) చూడండి. థ్రిల్ అవుతారు.

Also Read: Viral Video: నాకు కొంచెం సిగ్గెక్కువ గురూ...అందుకే..!

సౌత్ కరోలినా(South Carolina)లో ఓ మొసలి(Crocodile) చెరువు ఒడ్డున మరో మొసలి(Gator)ని నమిలి తింటుంది. దీనిని టేలర్ సోపెర్ అనే వ్యక్తి వీడియో తీసి తన ట్విట్టర్(Twitter) ఖాతాలో పోస్ట్ చేశాడు. తక్కువ వ్యవధిలోనే ఈ క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 4.8 మిలియన్ వ్యూస్ రాగా, 47,800 మంది లైక్ కొట్టారు. అలాగే 10,600 రీ-ట్వీట్లు వచ్చాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై లుక్కేయండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News