Viral: మీ ఆర్డర్ తీసుకురాను.. ఏం చేస్కుంటావో చేస్కో.. కస్టమర్ కు బిగ్ షాక్ ఇచ్చిన డెలీవరీ బాయ్.. ఆ తర్వాత..

Food Order On Swiggy: నేహ అనే మహిళ  తనకోసం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టింది. ఆలస్యం మవుతుండటంతో స్విగ్గీ డెలీవరీ బాయ్ కు కాల్ చేసింది. అతనేమో కోపంగా మాట్లాడుతూ.. ఏంచేస్కుంటావో.. చేస్కో.. ఆర్డర్ తీసుకురాను .. టైమ్ లేదంటూ కాల్ కట్ చేశాడు. దీంతో సదరు కస్టమర్ షాకింగ్ కు గురైంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 8, 2024, 01:26 PM IST
  • - కస్టమర్ కు షాక్ ఇచ్చిన స్విగ్గీ డెలీవరీ బాయ్..
    - ఎక్స్ లోతన బాధను పొస్ట్ చేసిన కస్టమర్..
Viral: మీ ఆర్డర్ తీసుకురాను.. ఏం చేస్కుంటావో చేస్కో.. కస్టమర్ కు బిగ్ షాక్ ఇచ్చిన డెలీవరీ బాయ్.. ఆ తర్వాత..

Swiggy Agent Refused To Deliery Order: మనలో చాలా మంది ఫుడ్ కోసం సిగ్గీ, జోమాటోలో ఆర్డర్ పెడుతుంటారు. ఇంట్లో ఫుడ్ చేసుకునే తీరిక లేని వారు, అదే విధంగా ఏదైన వెరైటీ స్పెషల్ గా తినాలనిపించినప్పుడు ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెడుతుంటారు. అయితే.. చాలా వరకు ఫుడ్ టైమ్ కు ఆర్డర్ వస్తుంది. కానీ కొన్ని సార్లు ట్రాఫిక్ లేదా మరేదైన సమస్యల వల్ల ఇబ్బందులు వస్తుంటాయి. ఈ క్రమంలో.. కొందరు డెలీవరీ బాయ్ లు పొలైట్ గా మాట్లాడుతుంటారు. కానీ కొందరు మాత్రం కస్టమర్ లతో రఫ్ గా బిహేవ్ చేస్తుంటారు. ఇష్టమోచ్చినట్లు మాట్లాడుతుంటారు.

 

ఇప్పటికే ఫుడ్ డెలివరీ బాయ్ లు,  కస్టమర్ లకు మధ్య జరిగిన అనేక ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. కొందరు డెలీవరీ బాయ్ లు , ఆలస్యంగా డెలివరీ చేయడం, కస్టమర్ పట్ల మిస్ బిహేవ్ చేయడం వంటి ఘటనలు వార్తలలో నిలిచాయి. మరికొన్ని చోట్ల డెలీవరీ బాయ్ ల పట్ల కస్టమర్లు కూడా ఒకింత తక్కువచేసి చూసిన ఘటనలు కూడా వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా... ప్రస్తుతం నేహ అనే మహిళ.. తనకు స్విగ్గీ డెలీవరీ బాయ్ ఇచ్చిన ట్విస్ట్ ను ఎక్స్ లో పంచుకుంది.  ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది. 

నేహ అనే మహిళ తన పిల్లల కోసం Swiggyలో ఫుడ్ ఆర్డర్ చేసింది.  ఫుడ్ డెలీవరీ బాయ్ కు కాల్ చేస్తే.. అతను  'మేరే పాస్ టైమ్ నహీ హై జో కర్నా హై కర్ లో నహీ లే కర్ ఔంగా ఆర్డర్' అన్నాడని రాసుకొచ్చింది. చాలా  సేపటి వరకు తన పిల్లలు ఆకలితో టైమ్ వెస్ట్ చేసుకుని మరీ ఉండిపోయామన్నారు. చివరకు మహిళ.. స్విగ్గీ కస్టమర్ కేర్ కు ట్విట్ చేసింది. తనకు ఎదురైన చేదు ఘటన గురించి పోస్ట్ చేసింది.  "నేను స్విగ్గీ నుండి ఫుడ్ ఆర్డర్ చేసాను. నాకు ఆర్డర్ రాలేదు. మీ డెలివరీ బాయ్ ఆర్డర్ డెలివరీ చేయడానికి నిరాకరించాడు. అంతేకాకుండా.. 'మేరే పాస్ టైమ్ నహీ హై జో కర్నా హై కర్ లో నహీ లే కర్ ఔంగా ఆర్డర్' అన్నాడు.

ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి?" నేహా S (@Neha_ns9999) Xలో రాశారు. ఆ మహిళ ఒక వడ పావ్,  రోల్ ఆర్డర్ చేసినట్లు సమాచారం. నేహా పోస్ట్ వైరల్ కావడంతో, కంపెనీ వెంటనే రీఫండ్ జారీ చేసింది. వైరల్‌గా మారిన ట్వీట్‌పై స్పందించిన స్విగ్గీ, కాల్‌తో విషయం పరిష్కరించబడిందని స్పష్టం చేసింది. కంపెనీ ఇలా వ్రాసింది, "@Neha_ns9999 బృందం దీనిని కాల్ ద్వారా పరిష్కరించగలదని రిప్లై ఇచ్చారు. మీకు ఏదైనా అవసరం అయితే మేము ఇక్కడే ఉన్నామని స్పందించింది. :)"
Read More: Ariyana Glory: క్రేజీ లుక్స్ తో కైపేక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ, లేటెస్ట్ పిక్స్ వైరల్

ఇదిలా ఉండగా.. పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ, డెలివరీ ఏజెంట్ పేరును భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మతో పంచుకున్నారని నెటిజన్‌లలో ఒక వర్గం ఎత్తి చూపారు.  ఇతరులు వీధిలో ₹ 15కి సులభంగా లభించే వడ పావ్‌ను వినియోగదారు ₹ 100కి కొనుగోలు చేశారని చెప్పారు. "వడా పావ్‌ను 100 రూపాయలకు కొనడం నేరం..  పాపం అని కామెంట్ చేశారు.  మీరు దాని కోసం వంద చెల్లించడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది. 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News