Python attack: బాప్ రే.. కేర్ టేకర్ మీద అమాంతం దాడికి పాల్పడిన కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..

Python attacks on caretaker: ఒక వ్యక్తి పాములు, కొండ చిలువల్ని జాగ్రత్తగా ఒక రూమ్ లో పెట్టెలలో పెంచుతున్నాడు. ఒక భారీ కొండ చిలువను బైటకు తీసి దాని గురించి వివరిస్తున్నాడు. ఇంతలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Aug 29, 2024, 10:59 PM IST
  • చుక్కలు చూపించిన భారీ కొండ చిలువ..
  • షాక్ కు గురౌతున్న నెటిజన్లు..
Python attack: బాప్ రే..  కేర్ టేకర్ మీద అమాంతం దాడికి పాల్పడిన కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..

python on caretaker video goes viral: మనలో చాలా మంది పాములంటే చచ్చేంత భయపడిపోతుంటారు. కొంత మందికైతే.. పాముల పేర్లు చెబితేనే వెన్నులో వణుకు పుడుతుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, గుట్టలు, అడవులు, పొలాల్లో పాములు, కొండ చిలువలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఈ ప్రదేశాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో పాములు,కొండ చిలువలు బైటకు వస్తుంటాయి. పాములకు చెందిన వెరైటీ వీడియోలు తరచుగా వెలుగులోకి వస్తుంటాయి. కొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటే.. మరికొన్ని షాకింగ్ కు గురిచేసేవిలా కూడా ఉంటాయి.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)

ఈ నేపథ్యంలో నెటిజన్ లు సైతం.. పాముల వెరైటీ వీడియోలను చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు.  కొంత మంది పాములు తమ ఇళ్లలోకి వస్తే.. వెంటనే స్నేక్ హెల్పింగ్ వాళ్లకుసమాచారం ఇస్తారు. మరికొందరు మాత్రం.. పాములన చంపడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ మన పెద్దలు మాత్రం పాములకు ఆపద కల్గిస్తే.. కాలసర్పదోషం సంభవిస్తుందని, లేని ఇబ్బందులు వస్తుంటాయని చెబుతుంటారు. అందుకే పాములు కన్పిస్తే.. దూరంగా వెళ్లిపోవాలని చెబుతుంటారు. చాలా వరకు పాములు, మనుషులకు అపకారం తలపెట్టవు. కేవలం కొన్నిసార్లు మాత్రం తమకు హనీకల్గుతుందని భావిస్తే మాత్రం అవి కాటు వేస్తుంటాయంట.

అయితే.. ఇక్కడోక వ్యక్తి భారీగా పాముల్ని, కొండ చిలువల్ని ఒక గదిలో అనేక పెట్టెలలో పెడుతూ, వాటిని చూసుకుంటున్నాడు. అయితే.. ఒక భారీ కొండచిలువను మాత్రం పెట్టేలో నుంచి బైటకు తీసి మరీ దాన్ని గురించి వివరిస్తున్నాడు. ఇంతలో కొండ చిలువ రెచ్చిపోయింది.

పూర్తి వివరాలు..

జేబ్రూవర్ అనే వ్యక్తికి పాములు, కొండ చిలువలను పెంచుకొవడమంటే మహాసరదా. తన ఇంట్లో వీటికోసం ప్రత్యేకంగా ఒక రూమ్ను సైతం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. అక్కడ రకరకాల పాములు, కొండ చిలువలు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో ఒక భారీ కొండ చిలువను బైటకు తీసి, దాని గురించి వివరిస్తు వీడియో రికార్డుచేస్తున్నాడు.

Read more: Kolkata doctor murder: అరగంటలో మూడు ఫోన్ కాల్స్.. కోర్టులో షాకింగ్ నిజాలు చెప్పిన కుటుంబీకులు.. ఎవరు చేశారో తెలుసా..?

ఇంతలో కొండ చిలువకు చిర్రెత్తుకొచ్చిందో. మరేంటో కానీ.. ఒక్కసారిగా తన కేర్ టేకర్ మీదనే దాడికి తెగబడింది. సెకన్ల వ్యవధిలో కొండ చిలువ దాడికి ప్రయత్నించింది. వెంటనే అతను కూడా సమయస్పూర్తిగా వ్యవహారించి దాని కాటు నుంచి తప్పించుకున్నాడు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కుగురౌతున్నారు.

Trending News