Girls wearing towels metro video viral: ఇటీవల కాలంలో కొంత మంది యువత ప్రవర్తించే తీరు వివాదాస్పదంగా ఉంటుంది. ముఖ్యంగా ఫెమస్ అవ్వడానికి ఏమైన చేస్తున్నారు. రకరకాల రీల్స్ లు, వీడియోలు తీస్తున్నారు. ఓవర్ నైట్ లో ఫెమస్ అయ్యేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ సోషల్ మీడియా పుణ్యామా... అని కొంత మంది ఓవర్ నైట్ లో ఫెమస్ అయిపోతున్నారు. దీంతో తామేం తక్కువ అన్న విధంగా చాలా మంది రకరకాల వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
కొంత మంది చేస్తున్న పనులు మాత్రం చాలా ఇబ్బందికరంగాను ఉంటున్నాయి. సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్ చేసేక్రమంలో ఇప్పటి వరకు చాలా మంది తమ ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో కొంత మంది బస్టాండ్ లు, మెట్రోలు, విమానశ్రయాలు.. ఎక్కడ రద్దీగా ఉంటుందో.. ఆ పాయింట్ ల దగ్గరకు వెళ్లి రీల్స్ చేస్తున్నారు.
దీంతో వీరు కాస్త వార్తలలో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. దీనిలో అమ్మాయిలు బాత్రూమ్ లో వేసుకునే టవల్స్ తో మెట్రోలో జర్నీ చేసినట్లు తెలుస్తొంది.
కొంత మంది అమ్మాయిలు కాస్తంత అతిగా ప్రవర్తిస్తున్నారు. రోడ్డు మీద లవర్స్ తో రొమాన్స్ చేసుకుంటే.. బైక్ ల మీద ముద్దులు పెట్టుకుంటూ వీడియోలు, రీల్స్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా.. ఎవరు ఏమనుకుంటే మాకేంటని విధంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు ఓవర్ నైట్ లో ఫెమస్ అయిపోయేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది అమ్మాయిలు టవల్స్ కట్టుకుని మెట్రోలో ఎక్కేశారు.
వీరిని చూసి అక్కడి వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మరికొందరు ప్రయాణికులు మాత్రం.. నవ్వుకున్నట్లు తెలుస్తొంది. వీరంతా.. మెట్రోలో సెల్ఫీలు దిగుతూ రచ్చ రచ్చ చేశారు. కొంత మంది ప్రయాణికులు వీళ్ల వాలకాన్ని తమ ఫోన్ లలో రికార్డు చేసినట్లు తెలుస్తొంది.
Read more: Viral Video: హనుమంతుడి ఆలయంలో గదతో వానరం.. ఆనందంతో పొంగిపోతున్న భక్తులు.. వీడియో ఇదిగో..
ప్రయాణికులతో కూడా వీరు ఫోటోలు దిగుతూ... పైత్యం చూపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం తిట్టిపోస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తు సభ్యసమాజంకు ఏంసందేశం ఇవ్వాలని చూస్తున్నారని ఫైర్ అవుతున్నారు.