గూగుల్ డూడుల్ గా హిరోటుగు అకైకే

Last Updated : Nov 5, 2017, 11:42 AM IST
గూగుల్ డూడుల్ గా హిరోటుగు అకైకే

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఆదివారం జపాన్ స్టాటిస్టీషియన్  డా.హిరోటుగు అకైకే 90వ పుట్టినరోజును ప్రత్యేక డూడుల్ తో ఆకట్టుకొంటోంది.

హిరోటుగు అకైకే జపాన్ లోని ఫుజినోమియాలో నవంబరు 5,1927 న జన్మించారు. అకైకే ఇన్ఫర్మేషన్ థియరీ మీద పనిచేశారు. 1970వ  ప్రారంభంలో మోడల్ సెలక్షన్ కోసం ఒక ప్రమాణాన్ని రూపొందించాడు. ఆ అకైకే ఇన్ఫర్మేషన్ క్రైటీరియన్, ఇప్పుడు విస్తృతంగా ఉపయోగించబడుతోంది. 

2006లో, అకైకే ఇన్ఫర్మేషన్ క్రైటీరియన్ (ఏఐసి) అభివృద్ధిలో గణాంక శాస్త్రం మరియు మోడలింగ్ కు ప్రధాన తోడ్పాటు అందించినందుకుగానూ 'క్యోటో బహుమతి'ని ఆయన అందుకున్నారు. అకైకే ఇబరకి ప్రిఫెక్చర్లో న్యుమోనియాతో బాధపడుతూ 81 సంవత్సరాల వయస్సులో ఆగష్టు 8, 2009న మరణించాడు.

ఆయన సేవలకు గుర్తింపుగా నవంబరు 5, 2017 న గూగుల్ హిరోటుగు అకైకే యొక్క 90 వ పుట్టినరోజుగా గూగుల్ ఒక డూడుల్ ను ప్రదర్శిస్తోంది. 

Trending News