Happy Teachers Day 2022: Quotes, GiFs and WhatsApp Messages for Your Teachers: ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న భారతదేశంలో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. భారత రెండో రాష్ట్రపతి, సుప్రసిద్ధ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని టీచర్స్ డే జరుపుకుంటారు. రాధాకృష్ణన్ ఒక ప్రముఖ పండితుడు, తత్వవేత్త, భారతదేశం మొదటి ఉపరాష్ట్రపతి అయిన రాధాకృష్ణన్.. 1888 సెప్టెంబర్ 5న మద్రాస్ దగ్గర్లోని తిరుప్తనిలో జన్మించారు. మద్రాస్, కలకత్తా, ఆంధ్రా యూనివర్శిటీలలో పని చేశారు. విద్యా రంగంలో ఆయన సేవలకు గుర్తుగా ఏటా సెప్టెంబర్ 5న టీచర్స్ డే జరుపుకుంటున్నాం.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, స్నేహితులు, మార్గదర్శకులు, గురువులకు.. ఈ శుభాకాంక్షలు, మెసేజెస్, కోట్స్ పంపుకోండి.
# డియర్ టీచర్.. మీ నిరంతర మార్గదర్శకత్వం మరియు మద్దతుకు ధన్యవాదాలు. మీరు లేకుండా ఈ అద్భుతమైన ప్రయాణం సాధ్యం కాదు. మీకు హ్యీపీ టీచర్స్ డే.
# ప్రియమైన గురువుకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీ వివేకం, నీతి, సహనం, అంకితభావం నన్ను మంచి వ్యక్తిగా ప్రేరేపించాయి.
# నిజాయితీ, చిత్తశుద్ధి, అభిరుచి గల మీ పరిచయం నన్ను జీవితంలో ముందుకు నడిపిస్తుంది. మీకు నా నుంచి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
# మీ శిక్షణనకు మేము కృతజ్ఞులం. మీరు చెప్పిన చదువుతో ఎంతో ఎత్తుకు ఎదిగాం. హ్యీపీ టీచర్స్ డే.
# విద్యార్థులు తమ అసాధారణమైన కలలను సాధించగలుగుతున్నారంటే.. దానికి కారణం మీలాంటి ఉపాధ్యాయులే. నిరంతరం మాకు వెన్నుదన్నుగా నిలుస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
# మా కలలను సాధించడంలో మీ సహాయం ఎంతో ఉంది.. మీకు హ్యీపీ టీచర్స్ డే.
# ప్రియమైన గురువు గారూ.. మీ అభిమానం, భక్తి, విద్య, ప్రేరణ మరియు కరుణ కోసం మీరు కీర్తించబడటానికి అర్హులు. మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
# మీరు అత్యంత నిస్వార్థం, అంకితభావం మరియు తెలివైన వ్యక్తి. మీకు హ్యీపీ టీచర్స్ డే.
# మా జీవితంలో మీలాంటి ఉపాధ్యాయులు మాకు చాలా అవసరం. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
# మంచి ఉపాధ్యాయులను కలిగి ఉండటం చాలా కష్టం. మీరు మా గురువుగా ఉండటం మా అదృష్టం. హ్యీపీ టీచర్స్ డే.
Also Read: నేడు 255 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే! వివరాలు ఇలా చెక్ చేసుకోండి
Alos Read: అర్షదీప్ సింగ్ కనబడితే కాల్చేస్తా.. బైక్‌పై బయలుదేరిన టీమిండియా ఫాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook