Wife Catches Husband: మరో మహిళతో కలిసి భార్య స్కూటీపై భర్త షికార్లు.. భార్యకు ఫోటో పంపించిన ట్రాఫిక్ పోలీసులు

Wife Catches Husband With An Other Woman: సిగరెట్ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎంత హానికరమో.. ఇంట్లో పెళ్లాం ఉండగా బయట మరొకరితో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకోవడం అంతకంటే హానికరం అనే విషయం మర్చిపోయి కొంతమంది ఇంట్లో పెళ్లాంకి తెలియకుండా బయట తప్పుడు పనులు చేస్తుంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2023, 06:47 PM IST
Wife Catches Husband: మరో మహిళతో కలిసి భార్య స్కూటీపై భర్త షికార్లు.. భార్యకు ఫోటో పంపించిన ట్రాఫిక్ పోలీసులు

Wife Catches Husband With An Other Woman: సిగరెట్ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎంత హానికరమో.. ఇంట్లో పెళ్లాం ఉండగా బయట మరొకరితో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకోవడం అంతకంటే హానికరం అనే విషయం మర్చిపోయి కొంతమంది ఇంట్లో పెళ్లాంకి తెలియకుండా బయట తప్పుడు పనులు చేస్తుంటారు. అయితే, పిల్లి పాలు తాగుతూ తనని ఎవ్వరూ కనిపెట్టడం లేదనుకున్నట్టుగానే.. ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్యలా చిలిపి పనులు చేసే వాళ్లు కూడా తమని ఎవ్వరూ కనిపెట్టడం లేదు అనే అనుకుంటారు. కానీ కంటికి కనపడని నిఘా నేత్రాలు ఎన్నో తమని ఒక కంట కనిపెడుతుంటాయనే విషయం వారికి తెలియదు. 

పెళ్లాం ఊరెళ్తే గాళ్ ఫ్రెండ్‌తో తిరుగుతూ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్లు కొంత మంది అయితే.. పెళ్లాం ఇంట్లో ఉండగానే బయట ప్రియురాలితో షికార్లు చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్లు ఇంకో రకం ఉంటారు. ఈ రెండూ పొరపాటే అనే విషయం వాళ్ల బండారం బయటపడనంత వరకు వాళ్లకు అర్థం కాదు. పెళ్లాంకి దొరకనంత వరకు దొరలా చలామణి అయినప్పటికీ.. ఒక్కసారి పెళ్లాం చేతికి చిక్కితే ఇక అంతే సంగతి అనే విషయం వారి దొంగతనం బయటపడే వరకు తెలిసి రాదు. 

కేరళ రాజధాని తిరువనంతపురంలో తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. కానీ ఈ ఘటన గురించి చదివాకా మీరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం ఖాయం. ఇది ఒక రియల్ స్టోరీ. భార్యను చీట్ చేస్తూ పట్టుబడిన ఓ భర్త రియల్ స్టోరీ. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఒకావిడను బైక్ పై ఎక్కించుకుని వెళ్తూ ట్రాఫిక్ కెమెరా కంటపడ్డాడు. అతడితో పాటు అతడి వెనుక కూర్చున్న మహిళ కూడా హెల్మెట్ ధరించకపోవడంతో స్పీడ్ కెమెరాలు అతడి ఫోటో తీసి ఆ స్కూటీ ఓనర్ కి ఛలాన్ పంపించాయి. ఇక్కడే అతడికి అసలు సమస్య వచ్చి పడింది. ఎందుకంటే ఆ స్కూటీ ఓనర్ మరెవరో కాదు.. అతడి భార్యనే. 

తనకు ఛలాన్ రావడం.. అందులో తన స్కూటీపై తాను కాకుండా తన భర్త వెనుక మరొక మహిళ కూర్చుని ఉండటం చూసిన భార్య.. ఆమె ఎవరో చెప్పాల్సిందిగా నిలదీసింది. అందుకు అతడు స్పందిస్తూ.. ఆమె ఎవరో తనకు తెలియదని.. దారిన వెళ్తూ లిఫ్ట్ అడిగితే బైకుపై ఎక్కించుకున్నానని చెప్పాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి పెద్ద గొడవ అయ్యింది అయితే, అతడి మాటలపై నమ్మకం లేక మరింత గట్టిగా నిలదీయడంతో తనకు సమాధానం చెప్పలేక తనను, తన మూడేళ్ల బిడ్డను గొడ్డును బాదినట్టు బాదాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై కర్మానా పోలీసు స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది.

Trending News