Viral Video: వామ్మో.. ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్ ప్రీవెడ్డింగ్ షూట్.. సినిమా పాటలకు మెడికోల రీల్స్.. సోషల్ మీడియాలో వైరల్..

Karnatka: కర్ణాటక చిత్రదుర్గలోని జిల్లా ఆరోగ్య అధికారి ఆపరేషన్ థియేటర్‌లో ఒక వైద్యుడు తన ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌ నిర్వహించారు. ఈ ఘటన కాస్త వైరల్ కావడంతో, ప్రభుత్వ అధికారులు దీనిపై సీరియస్ అయ్యారు.  ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్ చేస్తున్నట్లు వీడియోలకు ఫోజులిచ్చారు.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 10, 2024, 04:07 PM IST
  • - కన్నడ నాట వివాదాస్పందంగా మారిన ఫోటోషూట్..
    - ఆపరేషన్ థియేటర్ లో ఫోటో రచ్చ..
    - సినిమా పాటలకు మెడికోల డ్యాన్సులు..
Viral Video: వామ్మో.. ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్ ప్రీవెడ్డింగ్ షూట్.. సినిమా పాటలకు మెడికోల రీల్స్.. సోషల్ మీడియాలో వైరల్..

Doctror Pre Wedding Shoot In Operation Theatre: సాధారణంగా నేటి యువత పెళ్లి వేడుకలను ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. దీని కోసం ఎంత ఖర్చు చేయడానికైన అస్సలు వెనక్కు తగ్గడం లేదు. వెడ్డింగ్ ఏజెన్సీలతో కలసి ప్రత్యేక ప్రొగ్రామ్లకు ప్లాన్ లు చేస్తున్నారు. ప్రీవెడ్డింగ్ నుంచి అప్పగింతల వరకు కూడా ప్రతి ఒక్క వేడుకను ఎంతో వేడుకగా జరుపుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ప్రీవెడ్డింగ్ ల షూట్ ల ట్రెండ్ నడుస్తోంది.

 

కానీ ఈ షూట్ లలో యువత.. కాస్త పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారు. కొందరు వీడియోలు, ఫోటోలకు ఫోజుల కోసం అవసరం లేని పనులు లు చేసి, లైఫ్ నే రిస్క్ లో పడేసుకుంటున్నారు. వెడ్డింగ్ షూట్ ల కోసం కొండలు, అడవులు, ఎత్తైన ప్రదేశాలు, జలపాతాలకు సైతం వెళ్తున్నారు. కొన్నిసార్లు.. ప్రీవెడ్డింగ్ షూట్ లు విషాదాలుగా కూడా మారిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. అదే విధంగా సీరియస్ గా, హుందాగా ఉండాల్సిన ప్రదేశాలలో కూడా ఫోటోషూట్ లు తీసి వివాదాస్పదంగా మారుతున్నారు. అచ్చం అలాంటి ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన ఘటన కన్నడ నాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ తీవ్ర రచ్చకు దారితీసింది. చిత్రదుర్గలోని భరమసాగర్ ప్రాంతంలోని జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ అభిషేక్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇతని పెళ్లి ఈ మధ్యనే కుదిరింది. దీంతో డాక్టర్ ప్రొఫెషన్ కాబట్టి.. తన భార్యతో కలిసి వెరైటీగా ఆపరేషన్ థియేటర్ ఫోటోషూట్ కోసం ప్లాన్ లు చేశారు. తనకు కాబోయే భార్య.. తో కలిసి సర్జరీ చేస్తున్నట్లు ఫోజులిచ్చాడు.

వైరల్ గా మారిన వీడియోలో, డాక్టర్ అభిషేక్ ఒక రోగికి శస్త్రచికిత్స చేయడాన్ని చూడవచ్చు, అతని భాగస్వామి అతనికి సహాయం చేస్తుంది. ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ తర్వాత.. ఆ రోగి ఆరోగ్యంతో లేచి కూర్చున్నట్లు చూపిస్తారు. అంటే కాబోయే జంట ఇద్దరు కలిసి రోగి ప్రాణాలు కాపాడినట్లు థీమ్ వచ్చేలా షూట్ జరిగింది.  ప్రీ-వెడ్డింగ్ వీడియోను చిత్రీకరించడానికి ఆపరేషన్ థియేటర్‌లో స్పెషల్ గా కెమెరాలు, ఫోకస్ లైట్లను అమర్చి, అనేక మంది టెక్నికల్ సిబ్బంది వీడియో రికార్డు చేశారు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కన్నడ నాట దుమారం చెలరేగింది. కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు ఘటనపై సీరియస్ అయ్యారు. వెంటనే.. డాక్టర్ అభిషేక్‌ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశించారు. అంతే కాకుండా.. ఎక్స్ వేదికగా.. స్పందిచారు. "చిత్రదుర్గలోని భరమసాగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన డాక్టర్‌ని సర్వీసు నుండి తొలగించారు.

ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఉన్నాయి.  వ్యక్తిగత పనుల కోసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  డాక్టర్ల నుండి ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యాన్ని నేను ఎప్పటికి సహించనని"  X లో  పోస్ట్ చేశారు. ‘‘ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, సిబ్బంది సహా కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారం విధులు నిర్వహించాలని ఆదేశించారు. 

Pragya Jaiswal: హాట్ హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్, లేటెస్ట్ పిక్స్ వైరల్

ప్రభుత్వంలో ఇలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తపడాలని సంబంధిత వైద్యులను, సిబ్బందిని ఇప్పటికే సూచించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు.. కేవలం సామాన్యుల ఆరోగ్య సంరక్షణ కోసమేనని తెలుసుకుని విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ సీరియస్ గా ఉండాలని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. గదగ్ జిమ్స్ లో 38 మంది మెడికోలు రీల్స్ లు చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో తాజాగా వీళ్లను కూడా సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News