King Cobra Snake: పామును ముద్దు పెట్టుకున్న అమ్మాయికి ఏం జరిగిందో తెలుసా..?

King Cobra: ప్రస్తుతం నెట్టింట్లో పాములకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రా కు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వీడియోలో ఎక్కువగా నెటివిజన్లోకి భయం పుట్టించేవిగా ఉండడం విశేషం. పాములంటే అందరికీ భయమే..

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2022, 03:35 PM IST
  • పామును ముద్దు పెట్టుకున్న అమ్మాయి
  • నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
  • పెంచుకున్నది కావడంతో ఏం చేయలేకపోయిన పాము.
 King Cobra Snake: పామును ముద్దు పెట్టుకున్న అమ్మాయికి ఏం జరిగిందో తెలుసా..?

King Cobra: ప్రస్తుతం నెట్టింట్లో పాములకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రా కు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వీడియోలో ఎక్కువగా నెటివిజన్లోకి భయం పుట్టించేవిగా ఉండడం విశేషం. పాములంటే అందరికీ భయమే.. ముఖ్యంగా కింగ్ కోబ్రాలైతే చాలా భయాగనకంగా ఉంటాయి. ఈ పాములు ఒక్కసారి కాటేస్తే.. మనిషి మరణించడం ఖాయం. కింగ్ కోబ్రాలు మనుషులకు చాలా హానికరం. కాబట్టి వీటికి దూరంగా ఉండడం చాలా మంచిది.

అయితే ఇటీవల వైరల్ అయిన వీడియోలలో ఓ అమ్మాయి.. ఏకంగా కింగ్ కోబ్రానే ముద్దు పెట్టుకుంది.  ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో అమ్మాయి నల్లని డ్రెస్‌ను ధరించి పాము దగ్గరుకు వస్తుంది. ఆమెను ఆ పాము గమణిస్తుంది. అయినప్పటికీ కాటు వేయదు. సాధరణంగా కింగ్‌ కోబ్రాలు మనుషులకు చాలా హాని కలిగిస్తాయి. అంతేకాకుండా జంతువులను సైతం విడిచి పెట్టకుండా కాటేస్తూ ఉంటాయి. అయితే ఈ పాము ఆ అమ్మాయి దగ్గరకు వచ్చినా కాటేయకపోవడం చాలా విశేషం..

పాములను బయటి దేశాల్లో చాలా మంది పెంచుకుంటున్నారు. వాటికి ఆహారంగా పాలను కూడా పట్టిస్తూ ఉంటారు. ఇలా పెంచుకోవడం వల్ల అవి మనుషులకు అలవాటై..కాటు వేయడం మానుకుంటాయి. అంతేకాకుండా పెంచుకునే పాములకు కోరలు కూడా తీసివేస్తారు. ఇలా చేయడం వల్ల అవి మనుషులకు కాటువేసిన ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. కాబట్టి పెంచుకున్న పాములు ఎల్లప్పుడు మనుషులకు హాని కలిగించవు. అయితే మీరు ఈ వీడియోలో ఆమె పాముకు ముద్దు పెట్టడం పెద్ద సాహసోపేతమైన చర్యగా భావించవచ్చు.

ఇది పెంచుకున్న పాము కావడం వల్ల ఆమెను కాటేయలేక పోతుంది. బయట సంచరించే పాములను ఇలా ముద్దు పెట్టుకుంటే అవి కాటేసే అవకాశాలున్నాయి.  కాబట్టి ఇలాంటి సాహసాలు చేయకూడదని అడవి శాఖ సిబ్బంది తెలుపుతున్నారు. ఒకవేళ ఈ పాము కాటేయడం వల్ల మనిషి మరణించే అవకాశాలున్నాయి కాబట్టి.. వాటితో ఆటలాడడం మంచిది కాదు. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వీడియోను అమెజింగ్‌ థింక్స్‌ అనే యూట్యూబ్‌ చానెల్‌ నుంచి పోస్ట్‌ చేశారు. ఈ వీడియోకు 12 వేల మంది లైక్‌ చేయగా.. 2 లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు.

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x