Lion Eating Green Leaves: సింహం గడ్డి తింటుందా అని ఎవరినైనా అడిగితే.. ఆ ప్రశ్న అడిగిన వాళ్లను ఒకసారి కిందా మీదా తేరిపార చూసి.. ఛఛ అదేం చచ్చు ప్రశ్న.. ఎక్కడైనా సింహం గడ్డి తింటుందా అని ఎదురు ప్రశ్నిస్తారు కదా.. వాళ్లకు ఈ వీడియో చూపించండి.. ఆ తరువాత వాళ్ల సమాధానమే మారిపోతుంది. అంతేకాదు.. చాలామంది మేం నిప్పు లాంటి వాళ్లం.. నిఖార్సయిన వాళ్లం అని సొంత డప్పు కొట్టుకునే సందర్భంలో కూడా సింహాన్నే ఉదాహరణగా తీసుకుంటూ.. " ఎంత ఆకలి వేసినా సింహం గడ్డి తినదు అనే మాట ఎంత వాస్తవమో .. ఎన్ని కష్టాలు వచ్చినా తాము తప్పు చేయకుండా నీతి, నిజాయితీలకు కట్టుబడే ఉంటాం " అనే మాట కూడా అంతే వాస్తవం అని నీతి కథలు చెబుతుంటారు. తమని తాము గొప్పగా చూపించుకోవడం కోసం తమని తాము పులులు, సింహాలతో పోల్చుకుంటుంటారు.
ఐతే, ఇప్పటి వరకు ఇలాంటి మాటలు చెబితే చెప్పారేమో కానీ ఇకపై ఈ మాటలు అస్సలు చెప్పకండి. ఎందుకంటే ఇప్పుడు రోజులు మారిపోయాయి. సింహాలు కూడా గడ్డి తినడం మొదలుపెట్టాయి. ఛ ఊరుకోండి.. ఆకలేస్తే జంతువులను వేటాడి మరీ తినే సింహం లాంటి కృూరమృగాలు గడ్డి తినడం ఏంటి అని ఇంకా నమ్మలేకపోతున్నారా ?
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయాకా ఈ భూ ప్రపంచంలో ఎక్కడో ఏదో ఓ మూలన చోటుచేసుకున్న చిత్ర విచిత్రమైన వింతలు, విశేషాలను కూడా మనం ఇక్కడి నుండే చూసే భాగ్యం కలుగుతోంది. అందులోనే ఈ వీడియో కూడా ఒకటి. సింహం కూడా మేకలు, జింకలు, జిరాఫీల తరహాలో గాల్లోకి ఎగిరి మరీ ఓ చెట్టు కొమ్మను పట్టుకుని ఆ చెట్టుకు ఉన్న కొమ్మలను ఆవురావురుమని ఆరగిస్తోంది చూడండి.
ఏంటి ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నారు కదా.. ఔను సింహాలు, పులులు గురించి మనకు ఇంతకాలం ఉన్న అభిప్రాయం అటువంటిది మరి. మాంసం కంటే గ్రీన్ లీవ్స్ లోనే ఒంటికి పనికొచ్చే పోషకాలు చాలా ఉంటాయి అని ఈ సింహానికి కూడా తెలిసొచ్చిందో లేక మనుషుల్లాగే పెరిగిన అధిక బరువును తగ్గించుకునేందుకు మాంసం మానేసి పచ్చటి ఆకులు తింటూ డైటింగ్ మొదలుపెట్టిందో తెలియదు కానీ ఈ వీడియో చూసిన జనం అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి : Cats & Hen Viral Video: కోడి పిల్లలను పెంచుకుంటున్న పిల్లి.. ఆ సీన్ చూసి షాకైన తల్లి కోడి
అంతేకాదు.. తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నాం అనే భావనతో తాము చూసింది నిజమేనా కాదా అనే సందేహంతో చూసిన వీడియోనే మళ్లీ చూస్తున్నారు. అంతటితో సరిపెట్టుకోకుండా.. తమ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేస్తూ " ఇకపై సింహం, చింతకాయ్ పచ్చడి అంటూ కబుర్లు చెప్పమాకు " అని గొప్పలు చెప్పుకునే కోతలరాయుళ్లపై సెటైర్లు వేస్తున్నారు. చూశారా.. ఈ ఒక్క వీడియో మొత్తం సింహాలపై ఉన్న అభిప్రాయాన్నే మార్చేసింది.. ఈ వీడియో కానీ వేరే సింహం చూసిందంటే.. సింహాల జాతిలో చెడబుట్టావు కదరా అని అనుకుంటాయోమో మరి.
ఇది కూడా చదవండి : Cats Vs Snakes Fighting Videos: పిల్లులకు, పాములకు ఫైటింగ్ జరిగితే ఏది గెలుస్తుంది ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.