Man Bites King Cobra, Odisha Man Salim Nayak killed a snake by biting: సాధారణంగా పాము కాటేస్తే.. ఎవరైనా సరే లబోదిబో మంటూ వెంటనే ఆసుపత్రికి పరుగులు తీస్తారు లేదా నాటు వైద్యం చేయించుకుంటారు. చికిత్స అనంతరం కానీ వారి మనసు కుదుటపడదు. ఇక కింగ్ కోబ్రా లాంటి పాము కాటు వేస్తే.. ప్రాణ భయంతో వణికిపోతారు. అయితే ఓ వ్యక్తి తనను కింగ్ కోబ్రా కాటేసినా.. ఆసుపత్రికి వెళ్లకుండా దానిపై పగ తీర్చుకున్నాడు. దాన్ని కొట్టిచంపి పగ తీర్చుకున్నాడు అనుకుంటే.. మీరు పొరపాటు పడినట్టే. కింగ్ కోబ్రాను పట్టుకొని నోటితో కొరికి కొరికి మరీ చంపాడు. విషయంలోకి వెళితే..
మీడియా వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం బాలాసోర్ జిల్లాలోని బస్తా బ్లాక్ పరిధిలోని దర్దా గ్రామంలో సలీం నాయక్ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తుంటాడు. బుధవారం సలీం పొలం పనులు చేస్తుండగా.. అతని కాలుపై నాగు పాము కాటు వేసింది. నాయక్ చికిత్స చేయించుకోకుండా పొలంలో పాము కోసం వెతికాడు. పాము కనబడగానే తన చేతులతో పట్టుకున్నాడు. ఆవేశంతో పామును శరీరమంతా నోటితో కొరికాడు. పాము చనిపోయే వరకు సలీం కోరుకుతోనే ఉన్నాడు. చివరకు అది చనిపోయింది.
సలీం నాయక్ అక్కడితో ఆగలేదు. పామును మెడకు చుట్టుకుని సైకిల్‌పై గ్రామం మొత్తం తిరిగాడు. నాగు పామును పట్టుకొని కొరుకుతుండటాన్ని చూసినట్లు గ్రామస్థులు ఓ స్థానిక మీడియాకు తెలిపారు. పామును మెడలో వేసుకుని సైకిల్‌పై వెళ్లడం తాము చూశామని చెప్పారు. ఇందుకు సంబందించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం తెలుసుకున్న నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. 'ఓరినీ పగ పాడుగాను', 'నాగు పామును కొరకడం ఏంటి సామీ' అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.
స్థానిక మీడియాతో సలీం నాయక్ మాట్లాడుతూ... 'నేను పొలంలో గడ్డి కోస్తున్నప్పుడు నాగు పాము నా కాలు మీద కాటు వేసింది. వెంటనే నేను దాన్ని నా పిడికిలిలో పట్టుకుని మెడపై కొరికాను. ఆ తర్వాత నాటు వైద్యం చేయించుకున్నా. మేము దహనం చేయము కాబట్టి పాతి పెట్టాను' అని చెప్పుకొచ్చాడు. 2021 ఆగస్టులో ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
Also Read: లైవ్ మ్యాచ్‌లోనే.. అఫ్గానిస్థాన్ బౌలర్‌ను కొట్టబోయిన పాకిస్తాన్ బ్యాటర్! (వీడియో)
Also Read: పాకిస్తాన్ అభిమానులను చితకబాదిన అఫ్గానిస్థాన్ ఫాన్స్.. టీమిండియా ఫాన్స్ ఫుల్ ఖుషి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి