Mumbai Local Train: ముంబై లోకల్ ట్రైన్ ప్రమాదం, రైల్లోంచి జారి పడిన మహిళ, ఆ తరువాత ఏమైంది

Mumbai Local Train: లోకల్ రైళ్లు, సిటీ బస్సుల డోర్ల వద్ద వేలాడుతూ ప్రయాణించడం ప్రమాదమని తెలిసినా అదే పని చేస్తుంటారు. రద్దీ ఓ కారణమైతే..గమ్యస్థానంలో త్వరగా దిగిపోవాలనే ఆతృత మరొకటి. కారణమేదైనా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. అదే జరిగింది ముంబై లోకల్ ట్రైన్‌లో.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 22, 2022, 08:08 PM IST
 Mumbai Local Train: ముంబై లోకల్ ట్రైన్ ప్రమాదం, రైల్లోంచి జారి పడిన మహిళ, ఆ తరువాత ఏమైంది

Mumbai Local Train: లోకల్ రైళ్లు, సిటీ బస్సుల డోర్ల వద్ద వేలాడుతూ ప్రయాణించడం ప్రమాదమని తెలిసినా అదే పని చేస్తుంటారు. రద్దీ ఓ కారణమైతే..గమ్యస్థానంలో త్వరగా దిగిపోవాలనే ఆతృత మరొకటి. కారణమేదైనా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. అదే జరిగింది ముంబై లోకల్ ట్రైన్‌లో.

ముంబై అంటే లోకల్ ట్రైన్స్ గుర్తుకు రావల్సిందే. ముంబై ప్రజల జీవితం లోకల్ రైళ్లపైనే ఆధారపడి ఉంది. ఎప్పుడూ రద్దీగా ప్రయాణీకులతో కిటకిటలాడుతుంటాయి. లోకల్ ట్రైన్ డోర్ల వద్ద ప్రయాణీకులు వేలాడుతూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తుంటారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో ఓ మహిళ ఇలాగే డోర్ వద్ద నిలుచుని ప్రయాణిస్తుంది. వేగంగా ప్రయాణిస్తున్న రైలు నుంచి ఒక్కసారిగా పడిపోబోయింది. దాదాపుగా పడిపోయిందనే అనకున్నారంతా..ఒక్కసారిగా తోటి ప్రయాణీకుడు అప్రమత్తమై..పట్టుకుని అతికష్టంగా పైకి లాగాడు. బతుకు జీవుడా అంటూ ప్రాణాలు దక్కించుకుంది. మరో ప్రయాణీకుడు సహాయం చేయగా..తోటి ప్రయాణీకుడు లాగడంతో బయటపడింది.

వాస్తవానికి ఆమె డోర్ చివర్లో నిలుచుని ప్రయాణిస్తోంది. మధ్యలో ఓసారి ఆసరాగా పట్టుకున్న చేయి వదిలేసింది. అదే సమయంలో పక్క ట్రాక్ నుంచి మరో లోకల్ ట్రైన్ దూసుకెళ్లింది. ఆ ఉదుటికి ఒక్కసారిగా జారి కిందపడిపోబోయింది. తోటి ప్రయాణీకులిద్దరూ అప్రమత్తమై పట్టుకుని లాగకపోయుంటే..రెండు లోకల్ రైళ్ల మధ్య నలిగి ప్రాణాలు కోల్పోయేదే. చావు అంచు వరకూ వెళ్లి తిరిగొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also read: Crocodile Video: ముసలి దాడి చేస్తే ఏం చేస్తారు, ఆ పార్క్‌లో ఏం జరిగింది, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News