Cobra on bed: బెడ్ ఎక్కి పడుకున్న నాగు పాము

ఒక చిన్న పాము ( Snake ) ఇంట్లోకి వస్తేనే అంతా హడలెత్తిపోతారు. అలాంటిది 5 అడుగుల తాచు పాము ( Cobra ) బెడ్ రూమ్‌లోకి ప్రవేశించి ఏకంగా బెడ్ ఎక్కి పడుకుంటే ఇక ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.

Last Updated : Aug 26, 2020, 11:16 PM IST
Cobra on bed: బెడ్ ఎక్కి పడుకున్న నాగు పాము

ఒక చిన్న పాము ( Snake ) ఇంట్లోకి వస్తేనే అంతా హడలెత్తిపోతారు. అలాంటిది 5 అడుగుల తాచు పాము ( Cobra ) బెడ్ రూమ్‌లోకి ప్రవేశించి ఏకంగా బెడ్ ఎక్కి పడుకుంటే ఇక ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఒడిషాలోని కటక్ జిల్లా బంకి తాలుకా సమీపంలోని హరిరాజ్‌పూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. శరత్ పాండా అనే వ్యక్తి ఇంట్లోని బెడ్ రూమ్‌లోకి ఓ పాము ప్రవేశించింది. అది గమనించిన శరత్.. స్నేక్ సొసైటీ హెల్ప్ లైన్ ( Snake society help line numbers ) నెంబర్‌కి కాల్ చేశాడు. Also read : Pythons in field: పొలాల్లోకి కొండచిలువలు.. రెస్క్యూ వీడియో

ఓవైపు భారీ వర్షం కురుస్తోంది. అయినా సరే శరత్ కాల్ చేశారు కదా అని స్నేక్ సొసైటీ నుంచి ఇద్దరు ఆ పాము సురక్షితంగా పట్టుకుని తీసుకెళ్లేందుకు వచ్చారు. గది మొత్తం వెదికినా పాము జాడ కనిపించలేదు కానీ మధ్యమధ్యలో అది బుసలు కొడుతున్న శబ్ధం మాత్రం వినిపిస్తోంది. దీంతో పాము ఇక్కడే ఎక్కడో ఉంటుందనే అనుమానంతో వాళ్లు వెతకడం మాత్రం ఆపలేదు. నేలపై ఉన్న వస్తువుల చాటున వెతకడం పూర్తయ్యాకా ఆఖరికి అటకపైనున్న పాత టీవీ బాక్సును కూడా ఓపెన్ చేశారు. గదిలోని బెడ్‌పై కూర్చుని టీవీ బాక్స్ విప్పి చూశారు. ఆ సమయంలో పాము బుస కొడుతున్న శబ్ధం ఎక్కువ అవడంతో పాము అందులోనే ఉంటుందనే నిర్ణయానికొచ్చారు. కానీ పాము అందులో కూడా లేదు. అంతలోనే బెడ్ పై ఏదో కదులుతున్నట్టు గ్రహించిన మరో వ్యక్తి.. మొదటి వ్యక్తిని ఆ బెడ్‌పై నుంచి లేవాల్సిందిగా గట్టిగా హెచ్చరించాడు. దీంతో ఒక్క ఉదుటున బెడ్‌పై నుంచి లేచి చూస్తే.. బెడ్ షీట్ కవర్ కింద పాము కదులుతూ కనిపించింది. దానిని చిన్నగా ఒడిసిపట్టుకుని తీసుకుని వెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశారు. Also read : Viral video: కోతికి గిఫ్ట్ ఇస్తే.. కోతి ఫేస్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్ చూసి తీరాల్సిందే

భారీ వర్షాలు కురుస్తుండటంతో సర్పాలు, వణ్యప్రాణులు ఇలా సురక్షిత ప్రదేశాలు వెతుక్కుంటూ జనవాసాల్లోకి వస్తున్నట్టు సదరు స్నేక్ సొసైటీ సభ్యులు తెలిపారు. Also read : Viral video: స్విమ్మింగ్ కోసం వెళ్తే ఏమైందో చూడండి

Trending News