Snake Venom Affects The Blood Circulation: మనలో ప్రతిఒక్కరు పాములంటే చచ్చేంత భయపడిపోతుంటారు. ఎక్కడైన పాము అనివిన్పించిన కూడా అక్కడి ప్రదేశాలకు అస్సలు వెళ్లరు. పాములు ఎలుకల కోసం ఇళ్లరపరిసరాలలోకి వస్తుంటాయి. కొన్నిసార్లు పాములు మన ఇళ్లలోనికి కూడా ప్రవేశిస్తుంటాయి. ఇలాంటి సందర్భాలలో మానవులు పాముకాటుకు గురౌతుంటారు. ముఖ్యంగా బ్లాక్ మాంబా, నల్లత్రాచు, రాటిల్ స్నేక్ ల వంటివి కాటు వేయగానే వాటి నంచి వెలువడిన విషయం సెకన్ల వ్యవధిలో మనశరీరంలో ప్రభావం చూపిస్తుంది. వెంటనే మనిషిలోని నాడీ కణాలు నిర్వీర్యం అయిపోతాయి. అదే విధంగా రక్త ప్రసరణలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. నిముషాల వ్యవధిలోనే మనిషి కింద పడి, నోటి నుంచి బురుసు కక్కుకుని ప్రాణాలు విడుస్తాడు. ఇదంతా మనకు తెలిసిందే.
Effect of snake venom on blood! pic.twitter.com/QDUC9I2vtg
— Learn Something (@cooltechtipz) March 7, 2024
పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు షాకింగ్ కు గురిచేసేలా ఉంటే, ఇంకొన్ని చూడటానికి భయం కల్గించేలా ఉంటాయి. నెటిజన్లు సైతం పాములకు సంబంధించిన వీడియోలు ఆసక్తిగా చూస్తుంటారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాములంటే చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్లవరకు భయంతో వణికిపోతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాము విష ప్రభావానికి చెందిన ఒక వీడియో సోషల్ మీడియలో తెగ వైరల్ గా మారింది. దీన్ని cooltechipz అనే అకౌంట్ నుంచి ఎక్స్ లో పోస్టు చేశారు. దీనిలో మనిషి రక్తం పై పామువిషం చూపించే ప్రభావం అని క్యాప్షన్ ను జతచేశారు. ఈ వీడియోలో కొందరు ఒక భయంకరమైన పామును తీసుకొచ్చి, దాన్ని ఒక గ్లాసును కాటువేసేలా చేశారు. పాము ఆ గ్లాసుకు అమర్చిన క్లాత్ కు బలంగా కాటు వేయడంతో దాని కోరల్లోని విషం గ్లాజు అడుగు భాగంలో వచ్చి చేరింది.
వెంటనే మరో గ్లాసులో మనిషి రక్తం తీసుకున్నారు. పాము విషాన్ని ఒక సిరంజీలో తీసుకుని, రక్తం ఉన్న గ్లాసులో కొన్నిచుక్కలు వేశారు. వెంటనే సెకన్లలో పాము విషం, గాజులో ఉన్న రక్తంపై తన ప్రభావం చూపింది. చూస్తుండగానే.. గాజులో ఉన్న రక్తం గట్టిగా ముద్దలాగా మారిపోయింది.
Read More: Weight Loss Drink: బరువు తగ్గడానికి యాపిల్ జ్యూ స్.. ప్రయోజనాలు, చిట్కాలు ఇవే!
దీన్ని బట్టి పాము మన రక్తంప్రసరణను కూడా గడ్డకట్టేలా చేసి మనిషి చనిపోవడానికి కారణమౌతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. బాబోయ్.. పాము విషం ఇంతలా పనిచేస్తుందా.. ?.. వీడియో చూస్తేనే భయంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook