Snake Viral Video: తరగతిగదిలో పాము.. ఏసీ వెంట్‌ ద్వారా క్లాస్‌రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వీడియో వైరల్‌..

Snake In Class Room Viral Video: సోషల్‌ మీడియాలో పాముల వీడియోలను ఆసక్తిగా చూసేవారు ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. అనుకోని ఘటనలు మనల్ని అప్పుడప్పుడు భయబ్రాంతులకు గురిచేస్తాయి. ఏసీ ద్వారా క్లాస్‌రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పాము విద్యార్థులను ఉరుకులు పరుగులు తీసేలా చేసింది.

Written by - Renuka Godugu | Last Updated : Sep 21, 2024, 07:07 AM IST
Snake Viral Video: తరగతిగదిలో పాము.. ఏసీ వెంట్‌ ద్వారా క్లాస్‌రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వీడియో వైరల్‌..

Snake In Class Room Viral Video: సోషల్‌ మీడియాలో పాములకు సంబంధించిన పలు వీడియోలు వైరల్‌గా మారతాయి. ఈ మధ్య కాలంలో వరదల వల్ల కూడా నివాస ప్రాంతాల్లోకి పాములు ప్రవేశిస్తున్నాయి. అయితే, పాములు విష జంతువులు కాబట్టి వీటిని చూస్తే బెంబేలెత్తిపోతారు. అవి కాటేస్తే ప్రాణాలు కోల్పోతారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా పాము కాటుకు గురై చనిపోయే వారి సంఖ్య కూడా వేలల్లో ఉంటుంది.

అయితే, నోయిడాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. క్లాస్‌రూమ్‌లోకి ప్రవేశించిన పాము విద్యార్థులను భయభ్రాంలకు గురిచేసింది. నివాస ప్రాంతాలకే కాదు ఏకంగా తరగతి గదుల్లోకి కూడా పాములు వస్తున్నాయి. గతంలో కూడా ఓ స్కూల్లోకి పాము ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం తరగతి గదిలో పాము వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది, భయాందోళనలకు గురవ్వడం విద్యార్థుల వంతైంది.

సాధారణంగా క్లాస్‌రూమ్‌లలో టీచర్లు, విద్యార్థులు ఉంటారు. పాఠాలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ఓ అనుకోని ఘటన జరిగితే.. ఓ పాము అనుకోకుండా వారికి క్లాస్‌రూమ్‌లోకి ఎంటర్‌ అయింది. ఈ ఘటన అమిటీ యూనివర్శిటీ నోయిడాలో శుక్రవారం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇదీ చదవండి: ఎయిర్‌టెల్‌ జియో వీఐలకు భారీ షాకిచ్చిన యూజర్లు.. ఎన్ని లక్షల  సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయో తెలుసా?  

ఈ వీడియోలో క్లాస్‌రూమ్‌లో ఓ టీచర్‌ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా తరగతి గదిలో ఉన్న ఏసీ రూమ్‌లో నుంచి ఓ పాము కిందకు వేళాడుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడే ఉన్న కొంతమంది స్టూడెంట్స్‌ ఆ దృశ్యాన్ని తమ మొబైల్‌ ఫోన్‌లో బంధించారు.

కొంతమంది విద్యార్థులు పామును చూసిన వెంటనే అరుపులు, కేకలు వేస్తూ క్లాస్‌ రూమ్‌ నుంచి బయటకు పరుగులు తీశారు. ఎయిర్‌ కండీషనింగ్‌ వెంట్‌ ద్వారా కూడా పాములు ప్రవేశిస్తున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన విద్యార్థులు క్లాస్‌రూమ్‌ నుంచి పారిపోయారు. క్లాస్‌లో పాఠాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

 

ఇదీ చదవండి: ప్రతిరోజూ రూ.3 లక్షల లడ్డూ ప్రసాదం.. ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం.. వెలుగులోకి సంచలన విషయాలు..!

అయితే, పాము ఏసీ వెంట్‌ నుంచి బయటకు కనిపించిన వెంటనే అక్కడున్న టీచర్‌ పాఠాలను ఆపేశారు. పరిస్థితులను నియంత్రించి విద్యార్థులను బయటకు పంపించారు. వెంటనే వారు కాలేజీ సెక్యూరిటీ సహాయం తీసుకున్నారు. వారు వెంటనే యానిమల్‌ కంట్రోల్‌ వారి సహాయం తీసుకున్నారు. అయితే, ఈ ఘటనలో ఎవ్వరికీ ఏ హానీ జరగలేదు. స్నేక్‌ క్యాచర్‌ ద్వారా వెంటనే పామును బయటకు తీశారు. కానీ, అనుకోని ఘటన వల్ల ఒక్కసారిగా టీచర్లు, విద్యార్థులు భయభ్రాంతులకు లోనయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్‌లో షేర్‌ చేశారు. అది కాస్త వైరల్‌గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News