Onion Price: టమాటాకే కాదు ఉల్లి గడ్డలకు కూడా దొంగలు రాబోతున్నారు..!

కొద్దిరోజులుగా టమోటాల ధర 150 రూపాయల పైబడి మాటే. మధ్యతరగతి కుటుంబాలు కొనుక్కొని తినలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే టమోటా ధరలు కాస్త దిగివస్తుంటే.. నేషనల్‌ కమోడిటీస్ మేనేజ్‌మెంట్‌ సర్వీస్ లిమిటెడ్‌ ఎండీ సంజయ్ గుప్తా మరో బాంబు పేల్చారు.. మరో కొద్ది రోజుల్లో ఉల్లిధరలు కూడా పెరగనున్నట్లు తెలిపారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 15, 2023, 02:44 PM IST
Onion Price: టమాటాకే కాదు ఉల్లి గడ్డలకు కూడా దొంగలు రాబోతున్నారు..!

కొన్ని వారాల ముందు వరకు కిలో అయిదు పది రూపాయలు ఉన్న టమాటా ప్రస్తుతం రెండు వందల రూపాయలకు పైగా పలుకుతోంది. మార్కెట్‌ లో టమాటాలు కనిపిస్తే మొహం తిప్పుకోవాల్సిన పరిస్థితి. గతంలో కేజీలకు కేజీలు తిన్న వారు కూడా ఇప్పుడు తినకుండా ఉండటం.. లేదంటే పావు కేజీ లేదా అర కేజీతో సరిపెట్టుకోవడం చేస్తున్నారు. ఇది ఒక వైపు అయితే మరో వైపు టమాటా రైతులపై దాడులు.. టమాటా మార్కెట్ లో దొంగతనాలు భారీగా జరుగుతున్నాయి. 

ఈ మొత్తం వ్యవహారం టమాటా రేటు భారీ మొత్తంలో పెరగడం వల్లే అనడంలో సందేహం లేదు. టమాటా రేట్లు ఒక వైపు సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తే ఉంటే మరో వైపు సహజంగానే కన్నీళ్లు తెప్పించే ఉల్లి మరింతగా ఘాటు అవ్వబోతుంది. కోసేప్పుడు వచ్చే కన్నీళ్లు కొనుగోలు చేసే సమయంలోనే వచ్చే అవకాశాలు రాబోయే వారాల్లో రాబోతుంది అంటూ మార్కెట్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. 

ప్రస్తుతం ఉల్లి ధర ప్రాంతాల వారీగా రూ.30 నుండి రూ.40 వరకు పలుకుతోంది. సెప్టెంబర్‌ వరకు ఈ ధర రూ.100 ని క్రాస్‌ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ మార్కెట్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. నేషనల్‌ కమోడిటీస్ మేనేజ్‌మెంట్‌ సర్వీస్ లిమిటెడ్‌ ఎండీ సంజయ్ గుప్తా మాట్లాడుతూ ప్రస్తుతం 2.5 లోల మెట్రిక్ టన్నులు ఉల్లి నిల్వ ఉంది. ఆ మొత్తం రాబోయే రెండు నెలల్లో పూర్తి అయ్యే అవకాశం ఉంది. 

కనుక ఆ తర్వాత ఉల్లి సేకరణకు ఆలస్యం అవ్వబోతుంది. కొత్త ఉల్లి రావడానికి సమయం పడుతున్న కారణంగా రెండు నెలల పాటు ఉల్లి ధరకు రెక్కలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాత ఉల్లి నిల్వలు పూర్తి అయిపోయి.. కొత్త ఉల్లి వచ్చే గ్యాప్‌ లో రేటు భారీ మొత్తంలో ఉంటుంది. కనుక వినియోగదారులు మరియు మార్కెట్‌ వర్గాల వారు చూసుకోవాల్సిన అవసరం ఉంది. 

Also Read: 7th Pay Commission DA Hike: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంచుతూ నిర్ణయం  

కేవలం ఉల్లి ధర మాత్రమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు రాబోయే సెప్టెంబర్‌ అక్టోబర్‌ నవంబర్ లో పెద్ద మొత్తంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. భారీ ఎత్తున ఉల్లి ధరలు పలకడం వల్ల రైతులకు చేకూరే ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పటికే రైతుల నుండి ఉల్లి మొత్తం వ్యాపారస్తుల వద్దకు వెళ్లింది. వారు సెప్టెంబర్ నుండే కృత్రిమ కొరత సృష్టించి రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతానికి ఉల్లి ధర నార్మల్ గానే కనిపిస్తున్నా రాబోయే రోజుల్లో టమాటా రేటు ను మించడం ఖాయం. ప్రస్తుతం చుక్కల్లో ఉన్న టమాటా రేటు రాబోయే రెండు నెలల్లో మళ్లీ నేల చూపులు చూసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

Also Read: Gas Bill Offers 2023: గ్యాస్ బిల్లుల చెల్లింపులపై బంపర్ ఆఫర్స్.. ఈ ప్రోమో కోడ్‌లను వాడుకోండి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News