Peacock Dance Viral Video: రెండు నెమళ్లు ఒకేసారి పురి విప్పడం...రెండు కళ్లూ సరిపోని అద్భుత దృశ్యం

Peacock Dance Viral Video: నెమలి పురి విప్పడమనేది చాలా అరుదుగా కన్పించే అద్భుత దృశ్యం. అటువంటిది రెండు నెమళ్లు ఒకేసారి పురి విప్పితే..ఆ దృశ్యం చూసేందుకు రెండు కళ్లు చాలవు కదా. అదే జరిగింది. ఆ వీడియో మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 25, 2022, 08:56 PM IST
Peacock Dance Viral Video: రెండు నెమళ్లు ఒకేసారి పురి విప్పడం...రెండు కళ్లూ సరిపోని అద్భుత దృశ్యం

Peacock Dance Viral Video: నెమలి పురి విప్పడమనేది చాలా అరుదుగా కన్పించే అద్భుత దృశ్యం. అటువంటిది రెండు నెమళ్లు ఒకేసారి పురి విప్పితే..ఆ దృశ్యం చూసేందుకు రెండు కళ్లు చాలవు కదా. అదే జరిగింది. ఆ వీడియో మీ కోసం..

వాతావరణం ఆహ్లాదంగా ఉన్నప్పుడు..వర్షం పడి చల్లగా ఉన్నప్పుడు నెమళ్లు సైతం తన్మయత్వానికి లోనవుతాయి. ఆనందంతో పురి విప్పి నృత్యం చేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ నెమళ్లు పురి విప్పడమనేది చాలా అరుదుగానే కన్పిస్తుంది. ఆ దృశ్యం కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. అయితే నెమళ్లు నిజంగానే వాతావరణం బాగుంటే పురి విప్పుతాయా అంటే కాదనే చెప్పాలి. ఇప్పటి వరకూ ఉన్న మన ఆలోచన తప్పు. నెమళ్లు పురి విప్పడమనేది సహచర నెమలిని ఆకర్షించేందుకు చేస్తుంటాయి. కారణమేదైనా సరే..నెమలి పురి విప్పడమనేది అద్భుతమైన దృశ్యమే. మళ్లీ మళ్లీ చూడాలన్పించేంత అద్భుతంగా ఉంటుంది. 

అటువంటిది రెండు నెమళ్లు పక్కపక్కనే ఉండి ఒకేసారి పురి విప్పి డ్యాన్స్ చేస్తే ఆ దృశ్యం చూసేందుకు రెండు కళ్లూ చాలవు కదా. నిజమే అంత అద్భుతంగా ఉంటుంది ఈ దృశ్యం. అదే జరిగింది. ఆడ నెమలిని ఆకర్షించేందుకు మగ నెమలి పురి విప్పుతుంది. ఆడ నెమలి కూడా నచ్చితే..తనూ పురి విప్పుతుంది. అంటే రెండూ పురి విప్పడమనేది చాలా అరుదనే చెప్పాలి. అలాంటిదే ఈ దృశ్యం. ఈ వీడియో ఇలా షేర్ అయిందో లేదో వైరల్ అవుతోంది. ఇప్పటికే దాదాపు 35 మిలియన్లకు పైగా వీక్షించారు. 980 వేల లైక్స్ వచ్చి పడ్డాయి. ఇంకా వైరల్ అవుతోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by yourlifenature (@yourlifenature)

ఈ వీడియోలో రెండు నెమళ్లు పురి విప్పిన దృశ్యంతో పాటు ఇంకా చాలా నెమళ్లు చూడవచ్చు. నెమళ్లతో ఉన్న పెద్ద కేజ్ ఇది. ముందుగా ఒక బ్లూ నెమలి పురి విప్పుతుంది. అది చూసి వైటర్ కలర్ ఆడ నెమలి పురి విప్పి నృత్యం చేస్తుంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

Also read: Donkey Viral Video: గాడిద ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుందో తెలుసా..ఈ వైరల్ వీడియో చూడండి చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News