Viral Video: చేప ప్రాణాలు కాపాడిన శునకం

చాలా సార్లు మనుషులు కూడా మానవత్వం, జాలి చూపించడంలో విఫలం అవుతుంటారు.

Last Updated : Sep 28, 2020, 11:26 PM IST
    • చాలా సార్లు మనుషులు కూడా మానవత్వం, జాలి చూపించడంలో విఫలం అవుతుంటారు.
    • జంతువులు సహజంగా తమకు సంబంధం లేని విషయంలో క్రూరత్వం చూపించవు.
    • దానికి తోడు జాలి చూపిస్తుంటాయి.
Viral Video: చేప ప్రాణాలు కాపాడిన శునకం

చాలా సార్లు మనుషులు కూడా మానవత్వం, జాలి చూపించడంలో విఫలం అవుతుంటారు. జంతువులు సహజంగా తమకు సంబంధం లేని విషయంలో క్రూరత్వం చూపించవు. దానికి తోడు జాలి చూపిస్తుంటాయి. సోషల్ మీడియాలో ( Social Media ) ప్రస్తుతం ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసి ఎవరి మనసు అయిన ఇట్టే బరువెక్కుతుంది. ఈ వీడియోలో ఒక కుక్క ప్రాణాలను కాపాడుతుంది. నిజానికి చేపలంటే కుక్కలకు అస్సలు పడదు. కానీ విరోధాన్ని మరచి మంచితనాన్ని ప్రదర్శించింది ఈ శునకం.

ALSO READ| Tips To Use Sanitizer: శానిటైజర్‌ను ఎలా వాడాలో తెలుసా ?

చేప-కుక్క వీడియో
ఈ వీడియోను ఫారెస్టస్ అఫీసర్ సుశాంత నందా షేర్ చేశాడు. ఈ వీడియోను (Viral Video) నెటిజెన్లు చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇందులో మీరు ఒక కుక్క (Dog Video) తన  యజమానితో ఉన్నట్టు మీరు స్పష్టంగా చూడవచ్చు.  యజమానికి చేపలు పెంచడం అంటే ఇష్టం అని సులభంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే అతను చాలా చేపలను (Fish) తీసుకువచ్చాడు. వాటిని ఒక టబ్ లో వేశాడు. వీడియోలో మీరు చూడవచ్చు చేపలు నీరు లేక అల్లాడుతున్నాయి.

వీడియో చూడండి

ALSO READ|  Sri Krishna : ఈ  గ్రామంలో పాలు అమ్మరు  పంచుతారు..ఎందుకంటే..

మానవత్వాన్ని చూపించిన శునకం
అప్పుడే కుక్క చేపను చూస్తుంది. దానికి జాలి కలుగుతుంది. చేప గిలాగిలా కొట్టుకోవడం చూసి అది వెంటనే దాన్ని తన నోట కరుచుకుంటుంది. తినేస్తుందేమో అనుకున్నారు చాలా మంది . కానీ కుక్కమాత్రం తిన్నగా దాన్ని తీసుకెళ్లి నీటిలో వేస్తుంది. వెంటనే చేప ఈదడం ప్రారంభిస్తుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో చాలా మంది తెగ ఇష్టపడుతున్నారు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News