Pushpa Item Song: 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా' అంటున్న సీనియర్ నటి

Pushpa Item Song: పుష్ప ఫీవర్ ఇప్పట్లో తగ్గేలా లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పుష్ప డైలాగ్స్, పాటలే దర్శనమిస్తున్నాయి. ఈ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2022, 03:07 PM IST
Pushpa Item Song: 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా' అంటున్న సీనియర్ నటి

Pushpa Item Song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' (Pushpa) మూవీ క్రేజ్ ఇప్పట్లో తగ్గేలే లేదు. సోషల్ మీడియాలో (Social Media) ఎక్కడ చూసినా పుష్ప డైలాగ్స్, సాంగ్సే హల్ చల్ చేస్తున్నాయి.  పుష్ప మేనరిజంకు ప్రేక్షకులే కాదు.. సెలబ్రెటీలు సైతం ఫిదా అయ్యారు. ఇక క్రికెటర్లు అయితే పుష్ప సినిమాకు బ్రాండ్ అంబాసిడర్స్ గా మారారు. 

ఈ సినిమాలో సమంత (Samantha) చేసిన స్పెషల్ సాంగ్ ఒక ఊపు ఊపుందనే చెప్పాలి. ఈ పాటకు తమదైన స్టైల్లో స్టెప్పులేసి అదరగొడుతున్నారు ఫ్యాన్స్. తాజాగా 'ఊ అంటావా మావ.. ఉఊ అంటావ' (oo Antava)అంటూ సాగే ఈ పాటకు భలే ఫన్నీగా ఎడిట్ చేశారు. అనుపమ్ ఖేర్ (Anupam Kher) ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 

సల్మాన్ నటించిన 'హమ్ ఆప్కే హై కౌన్' (Hum Aapke Hai Koun) సినిమాలో దివంగత బాలీవుడ్ నటి రీమా లాగూ...'ఊ అంటావా మావ.. ఉఊ అంటావా' పాటను పాడినట్లు ఎడిట్ చేసి..పోస్ట్ చేశారు. ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

Also Read: Samantha Struggle Life: డబ్బుల్లేక ఒక్క పూట భోజనం చేసేదాన్ని.. రూ. 500 కోసం ఆ పనులు చేశానన్న సమంత!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News