Weird Job Offer: ఆ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ రాగానే ఒక్కసారిగా వేలాది మంది అప్లై చేశారు. ఆ కంపెనీ పేరు బెడ్‌బైబిల్. ఇది వర్క్ ఫ్రం హోం కాబట్టి..ప్రపంచం నలుమూలల్నించి దరఖాస్తులు వచ్చి చేరాయి. ఇంతకీ ఆ ఉద్యోగమేంటో తెలుసా..
హాయిగా..ప్రశాంతంగా ఉన్న ఉద్యోగం చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇంకొంతమందికైతే..ఎక్కువ పని లేకుండా..ఆహ్లాదం ఉండే ఉద్యోగం కోరుకుంటారు. బహుశా ఇటువంటివారి కోసమో అనుకుంటా..ఓ కంపెనీ ఉద్యోగ ప్రకటన చేసింది. ఆ ఉద్యోగం ఇంట్లో కూర్చుని..హాయిగా బెడ్‌పై పడుకుని రిలాక్స్డ్గా చేసేదే. హాయిగా పోర్న్ వీడియోలు చూస్తూ..రివ్యూ చేయాలి. అంతే అదే ఉద్యోగం. ఆశ్చర్యంగా ఉన్నా నిజమే. ఈ ఉద్యోగానికి ప్రతి గంటకు 15 వందల రూపాయలు లభిస్తాయి.
ఎడల్ట్ వీడియోలు చూసే ఉద్యోగం
ది సన్ నివేదిక ప్రకారం..ఈ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ వెలువడిన కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఈ ఉద్యోగం కోసం 31 వేలకంటే ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ కంపెనీ పేరు బెడ్‌బైబిల్. ఈ కంపెనీ ఎడల్ట్ ప్రొడక్ట్స్ రివ్యూ అందిస్తుంటుంది. ముఖ్యమైన విషయమేమంటే..ఈ ఉద్యోగం కోసం ప్రపంచంలోని ఏ వ్యక్తైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూర్చున్నా చేయగలిగే ఉద్యోగమిది. దీనికోసం ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు.
నోటిఫికేషన్లో అందించిన వివరాల ప్రకారం బెడ్‌బైబిల్ కంపెనీలో ఈ ఉద్యోగం కోసం ఎంచుకున్న వ్యక్తితో నిరంతరం కాంటాక్ట్‌లో ఉంటుంది. తద్వారా వీడియో టైమింగ్, మేల్-ఫిమేల్ నిష్పత్తి, హెయిర్ కలర్, భాష వంటి డేటా ఆధారంగా ఓ నివేదిక రూపొందిస్తుంది. ఈ నివేదిక ద్వారా వీడియో చూసేవారి అలవాట్ల గురించి తెలుసుకునే అవకాశముంటుంది. ఇందులో నియమితులైన సిబ్బంది 50 గంటల వరకూ వీడియోలు చూడాల్సి వస్తుంది. దీనికోసం మొత్తం 75 వేల రూపాయలు లభిస్తాయి.
ఈ ఉద్యోగం కోసం 21 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సుండాలి. బెడ్‌బైబిల్ కంపెనీ కంటెంట్ హెడ్ ఎడ్వినా చెప్పిందాని ప్రకారం..పోర్నోగ్రఫీ అనేది కోట్లాది డాలర్ల పరిశ్రమ. ఈ ఉద్యోగం కోసం నియమితులైన ఉద్యోగుల ద్వారా చేసే రీసెర్చ్‌తో ఎన్నో కొత్త విషయాలు బయటపడతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook