Whatsapp new feature: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సప్ త్వరలో మరో అద్భుతమైన ఫీచర్ ప్రవేశపెడుతోంది. కొన్ని వారాల వ్యవధిలోనే కొత్త ఫీచర్ రానుంది.
ఫేస్‌బుక్ (Facebook ) యాజమాన్యంలోని మెస్సేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్ ( Whatsapp ) మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. మరింతగా వినియోగదార్లను ఆకర్షించేందుకు వాట్సప్ ఇటీవలికాలంగా కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా మరో కొత్త ఫీచర్‌ను కొన్ని వారాల వ్యవధిలో అందుబాటులో తీసుకురానున్నట్టు వాట్సప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సప్ బీటా ఇన్ఫో తెలిపింది.
ఇప్పటి వరకూ వాట్సప్ వాయిస్ ( Whatsapp voice ), వీడియో కాల్స్ ( Whatsapp video calls ) కేవలం మొబైల్ వెర్షన్‌కే అందుబాటులో ఉంది. ఇప్పుడిక ఈ ఫీచర్లను వాట్సప్ వెబ్ యూజర్ల ( Whatsapp web users )కు కూడా అందుబాటులో తీసుకురానుంది. కొత్త ఫీచర్ అందుబాటులో వస్తే..వాట్సప్ వెబ్ వెర్షన్ యూజర్లు కూడా వాయిస్, వీడియో కాల్స్ చేసుకోగలరు. ప్రస్తుతానికి బీటా వెర్షన్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ వర్తించనుంది.
వాట్సప్ వెబ్ వెర్షన్ లేదా డెస్క్‌టాప్ వెర్షన్ ( web version or desktop version )కు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాట్సప్ కమ్యూనిటీ బ్లాగ్ వెల్లడించింది. మొబైల్ వెర్షన్ తరహాలోనే వాయిస్, వీడియో కాల్ బటన్ చాట్ హెడర్‌లోని కొన్ని స్క్రీన్ షాట్లను వాట్సప్ బ్లాగ్‌లో షేర్ చేసింది. వాట్సప్ వెబ్ లేదా డెస్క్‌టాప్‌కు కాల్ వచ్చినప్పుడు ప్రత్యేక విండో పాపప్ అవుతుంది. ఈ విండో ఆధారంగా కాల్ స్వీకరించడం లేదా తిరస్కరించడం చేయవచ్చు.
Also read: Wonder News: విమానం నుంచి జారిపడిన ఐఫోన్...ఇలా దొరికింది