WhatsApp: వాట్సాప్ లో కొత్త ఇమోజీలు.. చాటింగ్ లో డబుల్ మజా

వాట్సాప్ లో ఎక్కువగా చాటింగ్ చేసేవారికి గుడ్ న్యూస్. ఇక మీ కోసం మరిన్ని ఇమోజీస్ అందుబాటులోకి రానున్నాయి.

Last Updated : Aug 3, 2020, 02:04 PM IST
WhatsApp: వాట్సాప్ లో కొత్త ఇమోజీలు.. చాటింగ్ లో డబుల్ మజా

వాట్సాప్ ( WhatsApp ) వినియోగదారులకు శుభవార్త. ఇక చాటింగ్ ఎక్స్ పీరియన్స్ ( Chatting Experience ) మరింత సరదాగా మారనుంది. ఎందుకంటే ఇమోషన్ ను వెల్లడించే ఇమోజీలు ( Emojis ) మరిన్ని త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. చాటింగ్ అనుభవాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చడానికి వాట్సాప్ కొత్తగా ఇమోజీలను అప్డేడ్ చేయనుంది. మీరు వాటిని త్వరలో వినియోగించగలరు.  యూజర్లకు చాటింగ్ రీప్లై సమయాన్ని తగ్గించడానికి, సులభంగా, వేగంగా సమాధానం ఇవ్వడానికి వాట్సాప్ నిత్యం కొత్త మార్పులను అందుబాటులోకి తెస్తోంది. 

Read This Story Also :  BCCI Salary: క్రికెటర్లుకు 10 నెలల నుంచి జీతాల్లేవు

వాట్సాప్ గురించి తాజా సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి అందించే WabeteInfo అనే వెబ్ సైట్ ప్రకారం వాట్సాప్ ఇటీవలే మొత్తం 138 ఇమోజీలను ( WhatsAPp 138 Emojis ) అందుబాటులోకి తెచ్చింది. మీరు చాటింగ్ చేసే సమయంలో వీటిని వినియోగించవచ్చు. ఆండ్రాయిడ్ ( Android ) వెర్షన్ 2.20.197.6లో వాట్సాప్ ఈ ఇమోజిలను అందుబాటులోకి తెచ్చింది.

Read This Story Also: RBI Vacancy 2020: ఆర్‌బీఐలో ఉద్యోగ అవకాశాలు

Trending News