Viral Video: ఇదేక్కడి విడ్డూరం.. ఎయిర్ పోర్టులో సూట్ కేసును కసితీరా తిన్న యువతి.. షాకింగ్ వీడియో..

Woman Eats suitcase: మహిళ ఎయిర్ పోర్టులో సుట్ కేసు తింటూ హల్ చల్ చేసింది. చుట్టుపక్కల వారు ఆమె చేస్తున్న పనిని వింతగా చూస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 31, 2024, 04:40 PM IST
  • ఎయిర్ పోర్ట్ లో రచ్చ చేసిన యువతి..
  • ఆశ్చర్యంతో చూసిన ప్యాసింజర్స్..
Viral Video: ఇదేక్కడి విడ్డూరం.. ఎయిర్ పోర్టులో సూట్ కేసును కసితీరా తిన్న యువతి.. షాకింగ్ వీడియో..

Woman eats her suitcase at airport video goes viral: కొంత మంది ఫెమస్ అవ్వడానికి రకరకాల పనులు చేస్తుంటారు. ఇటీవల కాలంలో యువత సోషల్ మీడియాలో.. రీల్స్ ల మోజులో పడి తమ లైఫ్ ను రిస్క్ లో వేసుకుంటున్నారు. లైక్ లు, కామెంట్ల కోసం ఎంతటి రిస్క్ అయిన తీసుకొవడానికి వెనక్కు రావడం లేదు.అడవులు, ఎత్తైన కొండ ప్రాంతాలు, జలపాతాల దగ్గరకు వెళ్లి లేని పోనీ పనులు చేస్తున్నారు.కొన్ని సార్లు ఇలాంటి పనులు వల్ల ప్రాణాలు సైతం పోయిన ఘటనలు కొకొల్లలు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mayara Carvalho (@mayaracarvalho)

కొంత మంది రోడ్లమీద, రన్నింగ్ బైకుల మీద, బస్సులు, విమానాలు.. ఇలా ప్రతి చోట కూడా రీల్స్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక యువతి ఎయిర్ పోర్టులోచేసిన పని వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ మాత్రం షాక్ కు గురౌతున్నారు.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 

పూర్తి వివరాలు..

 యువతి ఎయిర్ పోర్టులో వెయిటింగ్ హాల్ లో కూర్చుని ఉంది. అప్పటి వరకు బాగానే ఉంది.. ఈ క్రమంలో ఆమె చేసిన పనిని చూసి అక్కడున్న చుట్టుపక్కల ప్రయాణికులు షాక్ కు గురయ్యారు. mayaracarvalho ఇన్ స్టా హ్యాండింల్ పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో ట్రెండింగ్ గా మారింది.

యువతి ఎయిర్ పోర్టులో కూర్చుని..ఒక్కసారిగా తన సూట్ కేసును కసితీరా కొరకడం స్టార్ట్ చేసింది. తొలుత అక్కడున్న వారు మహిళ చేసిన పనిని వింతగా చూశారు. అంతే కాకుండా.. యువతి..కొరికిన సూట్ కేసుతోనే అటు ఎటు వెళ్లడం చేసింది. దీంతో అక్కడున్న ఇతరులు కూడా ఆమెను చూస్తు ఉండిపోయారు. చాలా సేపటి తర్వాత .. అక్కడున్న వారికి తెలిసిందేంటంటే... అది కేక్ తో తయారు చేసిన సూట్ కేసు అని.

అప్పుడు ప్రయాణికులు షాక్ కు గురయ్యారు. అసలు.. ఇదేం ఐడియారా బాబు.. అంటూ తలలు పట్టుకుంటున్నారు. అయితే.. ఇదేం వెరైటీ రా నాయన అన్నట్లు ముఖం పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు దీనిపై తమ దైన స్టైల్ లలో కామెంట్లు చేస్తున్నారు.
 

Trending News