Zomato Food: చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు షాక్.. 'డబుల్ లాస్' అంటూ ట్వీట్..

Zomato Customer Shocks: జొమాటోలో 'ఇంటర్ సిటీ' డెలివరీ సర్వీస్ ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి ఫుడ్ ప్యాక్ చూసి షాక్ తిన్నాడు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 7, 2022, 12:37 PM IST
  • జొమాటో కస్టమర్‌కు షాక్
  • బిర్యానీ ఆర్డర్ చేస్తే కేవలం సాలన్ మాత్రమే డెలివరీ చేశారు
  • ట్విట్టర్‌లో కంప్లైంట్ చేసిన కస్టమర్
Zomato Food: చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు షాక్.. 'డబుల్ లాస్' అంటూ ట్వీట్..

Zomato Customer Shocks: జొమాటోలో బిర్యానీ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌ తనకు అందిన ఫుడ్ ప్యాక్ చూసి షాక్ తిన్నాడు. అందులో బిర్యానీ లేదు కానీ బిర్యానీతో కలుపుకునే 'మిర్చి కా సాలన్' మాత్రం ఉంది. దీంతో ఆ కస్టమర్ ఇదేం సర్వీస్ అంటూ ట్విట్టర్‌లో జొమాటోను నిలదీశాడు. తాను కేవలం కస్టమర్‌నే కాదు జొమాటో షేర్ హోల్డర్ అనే విషయాన్ని కూడా చెప్పాడు. జొమాటో ఇటీవల ప్రారంభించిన 'ఇంటర్ సిటీ ఫుడ్ సర్వీస్‌'లో తనకీ అనుభవం ఎదురైనట్లు చెప్పుకొచ్చాడు. దీంతో వెంటనే జొమాటో జరిగిన పొరపాటును సరిదిద్దుకుంది. ఆ కస్టమర్‌కు.. ఆర్డర్ చేసిన బిర్యానీతో పాటు ఎక్స్‌ట్రా బిర్యానీ కూడా ఉచితంగా పంపించింది.

ఆ కస్టమర్ పేరు ప్రతీక్ కన్వాల్. గురుగ్రామ్‌కి చెందిన ఆ కస్టమర్ ఇటీవల జొమాటో ఇంటర్ సిటీ ఫుడ్ సర్వీస్ ద్వారా హైదరాబాద్‌లోని షాదాబ్ హోటల్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఫుడ్ ప్యాక్ అందగానే దాన్ని తెరిచి చూడగా.. లోపల ఒక చిన్న బాక్స్‌లో 'మిర్చి కా సాలన్' కనిపించింది. అంతే.. లోపల అది తప్ప బిర్యానీ లేదు. దీంతో జొమాటోపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

'హైదరాబాద్ హోటల్ షాదాబ్ నుంచి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చిన్న బాక్స్‌లో 'సాలన్' మాత్రమే పెట్టి పంపించారు. ఇంటర్‌స్టేట్ లెజెండ్ సర్వీస్ ఒక గొప్ప ఐడియా. కానీ ఈ ఫుడ్ ప్యాక్ చూశాక నా డిన్నర్ ప్లాన్స్ అన్నీ గాల్లో తేలిపోయాయి. మీరిప్పుడు నాకు గుర్గావ్‌లో బిర్యానీ ఇప్పించాలి.' అంటూ ప్రతీక్ అనే ఆ కస్టమర్‌ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. జొమాటో కస్టమర్‌గా, షేర్ హోల్డర్‌గా ఇది తనకు 'డబుల్ లాస్' అని పేర్కొన్నాడు. మరొకసారి ఇలా జరగకుండా చూసుకోవాలని కోరాడు.

ప్రతీక్ చేసిన ఈ ట్వీట్‌కి జొమాటో పాజిటివ్‌గా స్పందించింది. ప్రతీక్‌కి అతను ఆర్డర్ చేసిన బిర్యానీతో పాటు ఎక్స్‌ట్రా బిర్యానీ పంపించింది. ఇదే విషయాన్ని ప్రతీక్ మరో ట్వీట్ ద్వారా వెల్లడించాడు. జొమాటో కస్టమర్ సర్వీస్ అండ్ ప్రొడక్ట్ హెడ్ ఈ ఇష్యూ పట్ల స్పందించి తగిన చర్యలు తీసుకున్నట్లు చెప్పాడు. ఇప్పుడొక షేర్ హోల్డర్‌గా జొమాటో కస్టమర్ సర్వీస్‌పై తాను సంతృప్తితో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.
 

Also Read: Delhi Liquor Scam:లిక్కర్ స్కాంతో కవిత ,రేవంత్ రెడ్డి వ్యాపార బంధం బయటపడిందా? ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా బీజేపీ మాస్టర్ స్ట్రోక్? 

Also Read: kids in Car Boot: కారు డిక్కీలో పిల్లలు.. షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News