Anant Chaturdashi 2022: దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇంటింటా, వీధి వీధినా గణేశుడు కొలువుదీరాడు. ఆగస్టు 31న ప్రారంభమైన ఉత్సవాలు పది రోజులపాటు అంటే సెప్టెంబర్ 9 వరకు కొనసాగుతాయి. వినాయకుడి నిమజ్జనం భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్ధశి నాడు అంటే అనంతర చతుర్ధశి రోజున చేస్తారు. అనంత చతుర్దశి ఎప్పుడు, పూజ ముహూర్తం, విశిష్టత తెలుసుకుందాం.
తేదీ, శుభ ముహూర్తం
హిందూ క్యాలెండర్ ప్రకారం, భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తేదీ గురువారం, 08 సెప్టెంబర్ రాత్రి 09:02 గంటలకు ప్రారంభమై... 09 సెప్టెంబర్, శుక్రవారం సాయంత్రం 06:07 వరకు ఉంటుంది. ఉదయతిథి ఆధారంగా అనంత చతుర్దశి సెప్టెంబర్ 09న జరుపుకుంటారు. ఈ రోజు ఉదయం 06.03 గంటల నుండి సాయంత్రం 06.07 వరకు శుభ సమయం.
రవియోగంలో అనంత చతుర్దశి
ఈ ఏడాది అనంత చతుర్దశి నాడు రవియోగం, సుకర్మ యోగం ఏర్పడుతున్నాయి. ఈ రోజున రవియోగం ఉదయం 06:03 నుండి 11.35 వరకు, సుకర్మ యోగం ఉదయం నుండి సాయంత్రం 06.12 వరకు ఉంటుంది. ఆ తర్వాత ధృతి యోగం ఏర్పడుతుంది. ఈ రోజున, పౌర్ణమి తిథి సాయంత్రం 06.07 నుండి ప్రారంభమవుతుంది.
గణపతి నిమజ్జనం
అనంత చతుర్దశి నాడు గణపతి నిమజ్జనంతో గణేశోత్సవం ముగుస్తుంది. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లలో ఉంచిన గణేష్ విగ్రహాలను, వీధిలో పెట్టిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు. అనంత చతుర్దశి సందర్భంగా వినాయకుడితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజిస్తారు. ఈ రోజున ప్రజలు పూజానంతరం వారి మణికట్టుపై రక్షా సూత్రం లేదా ఎరుపు దారం కట్టుకుంటారు.
Also Read: కన్యారాశిలో బుధ సంచారం... ఈ రాశుల వారికి ధనప్రాప్తి, కెరీర్ లో పురోగతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook