Ashadh Month 2022: ఆషాఢ మాసంలో ఈ 5 పనులు చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుంది!

Ashadh Month 2022: హిందూ మతంలో ప్రతి నెలకు దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసం మొదలైంది. ఈ మాసంలో సూర్యారాధన, గురుపూజ, దాన ధర్మాలు మొదలైన వాటి విశేష ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. ఆషాఢ మాసంలో కొన్ని పనులు చేయడం వల్ల మనిషికి మోక్షం కలుగుతుంది. ఈ పనుల గురించి తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2022, 09:10 AM IST
  • మెుదలైన ఆషాఢ మాసం
  • రైతులకు ఈ మాసం ఎంతో ప్రత్యేకం
  • ఈ నెలలో సూర్యభగవానుడిని ఆరాధిస్తారు
Ashadh Month 2022: ఆషాఢ మాసంలో ఈ 5 పనులు చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుంది!

Ashadh Month 2022: హిందూ మతంలో ప్రతి రోజు లేదా నెల ఏదో ఒక దేవత ఆరాధనకు అంకితం చేయబడింది. జ్యేష్ఠ మాసం తర్వాత ఆషాఢ మాసం (Ashadh Month 2022) మొదలైంది. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో నాల్గవ నెల. రైతులకు ఈ మాసం చాలా ప్రత్యేకం. ఎందుకంటే వర్షాలు ఎక్కువగా కురిసే మాసం ఇది. ఈ మాసంలో కురిసిన వర్షాలు రైతులకు మేలు చేస్తాయి. ఈ మాసంలో ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు. అలాగే సూర్య భగవానుని ఆరాధనకు కూడా ఈ మాసం చాలా ప్రత్యేకం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆషాఢ మాసంలో ఆనందం, శ్రేయస్సు మరియు మోక్షం కోసం కొన్ని పనులు చెప్పబడ్డాయి. 

ఆషాఢ మాసంలో ఈ పని చేయండి
>> ఆషాఢమాసంలో రాగి పాత్రలో నీరు, అక్షత, పూలు, రోలి పోసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించే సంప్రదాయం శతాబ్దాల నాటిది. ఇది గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుని అనుగ్రహం పొంది ముక్తిని పొందుతారు.
>> ఆషాఢమాసంలో వర్షాలు బాగా కురిసి పంటలు పండాలని కొన్ని మంత్రాలు జపిస్తారు. ఈ మాసంలో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ మొదలైన మంత్రాలను పఠిస్తారు. 
>> ఈ మాసంలో వేడిగాలుల తీవ్రత కారణంగా ప్రజలు డబ్బు, ఆహార ధాన్యాల కొరతతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అందుకే ఈ మాసంలో డబ్బు, ధాన్యాలు మరియు గొడుగు మొదలైన వాటిని దానం చేస్తే... ప్రజలు ముక్తిని పొందుతారు.
>> ఈ మాసంలో ప్రజలు తీర్థయాత్రలకు వెళతారు. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతుష్టులవుతారని నమ్మకం.  
>> ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. ఈ రోజున మన గురువుల ఆశీస్సులు పొందడం ఆనవాయితీ. ఇలా చేయడం ద్వారా ఒక వ్యక్తి వ్యాపారంలో విజయం సాధిస్తాడు. ఇది సంపద, కీర్తి యొక్క ప్రయోజనాన్ని ఇస్తుంది.

Also Read: Yogini Ekadashi 2022: యోగినీ ఏకాదశి రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News