Tulsi Plant: తులసి మొక్కకు రోజూ ఇలా చేస్తే మీరు కోటీశ్వరులవడం ఖాయం

Tulsi Plant: హిందూమతంలో కొన్ని వస్తువులు, మొక్కలు, చెట్లకు విశేష ప్రాధాన్యత, మహత్యముంటాయి. అలాంటివాటిలో తులసి మొక్క అత్యంత పవిత్రమైంది. తులసి మొక్కకు నిత్యం పూజలు చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 26, 2023, 04:34 PM IST
Tulsi Plant: తులసి మొక్కకు రోజూ ఇలా చేస్తే మీరు కోటీశ్వరులవడం ఖాయం

Tulsi Plant: హిందూవులు తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావిస్తారు. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో పెరట్లో తప్పకుండా కన్పిస్తుంది తులసి మొక్క. తులసి మొక్కను లక్ష్మీదేవికి ఆవాసంగా భావించడం వల్ల ప్రతి రోజూ పూజలు చేస్తారు. హిందూమతంలో తులసి మొక్క విశిష్టత, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

హిందూమత విశ్వాసాల్లో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. హిందూ వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఇంట్లో తప్పకుండా తులసి మొక్క ఉండితీరాలి. అంతేకాకుండా ప్రతిరోజూ క్రమం తప్పకుండా తులసి మొక్కలు పూజలు చేస్తూ జలాభిషేకం చేయాలి. తులసి మొక్కకు రోజూ నీరు పోయడంతో పాటు కలావా కట్టడం వల్ల ఆ వ్యక్తి ఇంట్లో డబ్బులకు కొదవ ఉండదని అంటారు. దాంతోపాటు ఆ ఇంట్లో ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం కొన్ని మొక్కలు లేదా చెట్లకు కలావా కట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభించడమే కాకుండా గ్రహ దోషాలుంటే తొలగిపోతాయి.

జ్యోతిష్యం ప్రకారం తులసి మొక్కను రోజూ పూజించడం వల్ల వ్యక్తి కుండలిలో ఏవైనా గ్రహ దోషాలుంటే తొలగిపోతాయి. తులసి మొక్క ఉండటం వల్ల ఆ ఇంట్లో సుఖ శాంతులు వర్ధిల్లుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా తులసి మొక్కకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో తులసి మొక్క పెట్టడం వల్ల, పూజ చేయడం వల్ల నెగెటివిటీ దూరమౌతుంది. ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. తులసి మొక్కకు ఎర్ర రంగు కలావా కట్టడం వెనుక హిందూమతంలో అత్యంత మహత్యముంది. ఎరుపు రుంగు అనేది శుభానికి ప్రతీకగా పరిగణిస్తారు. తులసి మొక్కలో ఎర్రని కలావా కట్టడం వల్ల ఆర్ధికపరమైన సమస్యలుంటే అన్నీ తొలగిపోతాయి. ఆర్ధిక ఇబ్బందులుంటే తొలగిపోతాయి. దాంతోపాటు విష్ణువు, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ప్రతిరోజూ తులసి మొక్కకు నీరు అభిషేకించి సాయంత్రం నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు వర్ధిల్లడమే కాకుండా ధన ధాన్యాలతో ఆ ఇళ్లు విరాజిల్లుతుంది.

ఉదయం వేల స్నానం చేసిన వెంటనే ఓ చెంబులో నీళ్లు తీసుకుని తులసి మొక్కకు అభిషేకం చేయాలి. అనంతరం తులసి మొక్కకు రోలీ, కుంకుమ, పసుపు రాయాలి. ఆ తరువాత కనీసం మూడుసార్లు ప్రదక్షిణం చేస్తూ పూలు సమర్పించాలి. ఆ తరువాత నెయ్యితో దీపం వెలిగించితే తులసి మొక్కకు కలావా కట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు వర్ధిల్లుతాయి.\

Also read: Mangal Gochar 2023: కుజుడు సంచారంతో లగ్జరీ లైఫ్ అనుభవించే రాశులివే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News