Zodiac Signs Personalities: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి రాశివారికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. రాశిని బట్టి ఆ వ్యక్తుల లక్షణాలుంటాయి. ఆ నాలుగు రాశుల జాతకులు మాత్రం ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలరు..ఆ వివరాలు మీ కోసం..
హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఓ ప్రత్యేకత ఉంది. అదే విధంగా ప్రతి రాశివారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. రాశిని బట్టి ఆ జాతకుల స్వభావం, వైఖరి మారుతుంటాయి. మేషరాశివారు నిర్భయులుగా సాహసికులుగా ఉంటారు. మిధున రాశి జాతకులు బుద్ధిమంతులుగా ప్రతీతి. అదే సమయంలో కొన్ని రాశులవాళ్లు..ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలరు. అవతలి వ్యక్తుల మనస్సుల్ని గెల్చుకోగలరు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మిధునం, సింహం, తుల, మకర రాశులకు ఆ ప్రత్యేక లక్షణాలున్నాయి. అత్యంత సులభంగా అవతలి వ్యక్తుల్ని తమవైపుకు లాక్కోగలరు.
మిధున రాశి Gemini మిధునరాశికి గురువు బుధ గ్రహం. బుధ గ్రహం స్వభావంతో ఈ రాశి జాతకులు మాట్లాడటంలో నేర్పరులు. చిరునవ్వు చెరగని స్వభావం కలవారు. వీరి సెన్సాఫ్ హ్యూమర్ అద్భుతంగా ఉంటుంది. మిధున రాశి జాతకులు ఒక్కసారికే ఎవరినైనా ఆకర్షించగలరు. కలుపుగోలు స్వభావం ఎక్కువ. త్వరగా స్నేహం చేయగలరు.
సింహరాశి Leo సింహరాశి జాతకులు డ్యాషింగ్ వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరిలోని ఈ స్వభావమే ఇతరుల్ని ఆకర్షించేలా చేస్తుంది. సింహరాశి జాతకులు ఎక్కడికి వెళ్లినా..తమ ప్రభావాన్ని వదులుతుంటారు. చాలా సోషలిస్టిక్గా ఉంటారు. తొలి కలయికలోనే ఎవరినైనా ఇంప్రెస్ చేయగలరు. సమాజంలో గౌరవ మర్యాదలు అధికంగా ఉంటాయి.
తులా రాశి Libra తులా రాశికి గురువు శుక్రుడు. శుక్రుడి ప్రభావం వల్ల ఈ జాతకులు మృదు స్వభావులు. తులా రాశివారి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన యువకులు చాలా త్వరగా అమ్మాయిల మనస్సు గెల్చుకుంటారు. చాలా సులభంగా వీరివైపు ఆకర్షితులౌతారు. ఈ రాశివారి కళ్లలో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది.
మకర రాశి Capricorn మకర రాశివారు చిరునవ్వు స్వభావం కలిగిన వ్యక్తులు. ఇతరుల్ని తమవైపుకు ఆకర్షించగలరు. చాలా కష్టపడే మనస్తత్వతం, బుద్ది, తెలివితేటలు కలిగినవారు. ఈ జాతకులు ఎక్కడికి వెళ్లినా..ప్రధాన ఆకర్షకులుగా ఉంటారు. చాలా కేరింగ్ స్వభావం కలిగి ఉంటారు.
Also read: Shani Amavasya 2022: శని అమావాస్య ఎప్పుడు, తిధి, పూజా విధానం, శుభ ముహూర్తం వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook