Shani Dev: శనిదేవుని అనుగ్రహం పొందాలంటే.. ఈ సింపుల్ పరిహారాలు చేయండి!

Shani Dev remedies:  మీపై శనిదేవుడు కోపంగా ఉంటే..ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఈ 5 సులుభమైన మార్గాలను పాటించండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 15, 2022, 10:14 AM IST
Shani Dev: శనిదేవుని అనుగ్రహం పొందాలంటే.. ఈ సింపుల్ పరిహారాలు చేయండి!

Shani Dev remedies: మీరు ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో డబ్బు నిలవట్లేదా? మీరు మెుదలు పెట్టిన పనిలో తరుచు అటంకాలు ఏర్పడుతున్నాయా? మీరు తరుచూ అనారోగ్యం బారిన పడుతున్నారా? వీటిన్నింటికి కారణం శనిదేవుడు (Shani Dev) మీపై కోపంగా ఉండటమే. శనిదేవుడి అనుగ్రహం మీపై దేనికీ లోటు ఉండదు. అందుకే శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి 5 సులభమైన మార్గాలను మీకు తెలియజేస్తున్నాం.

నల్ల కుక్కకు రొట్టె తినిపించండి
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, జంతువులు మరియు పక్షులకు ఆహారం ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. శని దేవుడు మీపై కోపంగా ఉంటే.. ప్రతి శనివారం నల్ల కుక్కకు రోటీ లేదా రొట్టెని తినిపించండి. ఇలా చేయడం వల్ల మీ పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా పూర్తవుతుంది. 

నల్ల బట్టలు ధరించండి
నలుపు రంగు శని దేవుడికి ఇష్టమైనదిగా భావిస్తారు. మీరు ప్రతి శనివారం నల్ల బట్టలు ధరించడం వల్ల శనిదేవుడి అనుగ్రహం మీపై కురుస్తుంది.  మీరు ఏ పని మెుదలుపెట్టినా అది విజయవంతంగా పూర్తి అవుతుంది. 

నలుపు రంగు వస్తువులను దానం చేయండి
మీరు శనిదేవుని ఆశీస్సులు పొందాలనుకుంటే.. ప్రతి శనివారం నల్ల పప్పు, నల్ల ఆవాలు, నల్లని వస్త్రాలు లేదా నలుపు రంగు వస్తువులను పేదవారికి దానం చేయండి. ఇలా చేయడం వల్ల చెడిపోయిన పని కూడాపూర్తవుతుంది. 

ఆవనూనె దీపం వెలిగించండి
ప్రతి శనివారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవనూనె దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. శనిదేవుడి అనుగ్రహం వల్ల మీ మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. 

రావిచెట్టుకు నీరు పోయండి
శనిదేవుని ఆశీర్వాదం పొందడానికి, ప్రతి శనివారం రావి చెట్టుకు నీరు పోయండి. ఇది హిందూ మతంలో చాలా పవిత్రమైన మెుక్కగా భావిస్తారు. 

Also Read: Sun Transit Effect: కర్కాటక రాశిలో సూర్య సంచారం.. ఈ 4 రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలు!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News