Astrology: గ్రహాలకు సర్వ సైన్యాధ్యక్షుడైన కుజుడు ఈ రోజు రాత్రి మకరరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ రోజు నుంచి మార్చి 15, 2024 వరకు కుజుడు మకరంలో సంచరించనున్నాడు. ఇది మేషాది 12 రాశులను తీవ్ర ప్రభావితం చేయనున్నాయి. శని రాశి అయిన మకరంలో కుజుడు సంచరించడం వల్ల ఈ రాశుల వారికీ మంచి ఫలితాలు కలగనున్నాయి. శని దేవుడికి సంబంధించిన మకరంలో కుజుడు ఉచ్చంలో ఉంటాడు.దీంతో ఈ 6 రాశుల వారికి అద్బుతంగా ఉండబోతుంది. మరి కుజుడు ఎలాంటి మార్పులు చేయబోతున్నాడో మీరు ఓ లుక్కేయండి..
మేష రాశి:
వీరిక మనో ధైర్యం అధికంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవస్థల నుంచి పూర్తి ప్రయోజనం పొందే అవకాశాలున్నాయి. కోపం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉంది.
వృషభం:
ఈ రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. మనో ధైర్యం పెరుగుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. గృహ, వాహన సుఖం ఉంటాయి. మీ తోబట్టువులతో సన్నిహితులతో గడుపుతారు. రోజువారీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది.
మిథునం:
రోజువారీ ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితం మరియు ప్రేమ సంబంధాలలో సానుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనం పొందే ఛాన్సెస్ ఉంది. ఆకస్మిక ధనలాభం వచ్చే పరిస్థితి ఏర్పడవచ్చు. ఉదర సమస్యలు పెరగవచ్చు. శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు అత్యంత అనుకూలం.
కర్కాటకం:
సామాజిక హోదా, ప్రతిష్ఠలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం మరియు వ్యాపారంలో పెను మార్పులు చేసే అవకాశం ఉంది. మానసిక తీవ్రత పెరగడం సాధ్యమనే చెప్పాలి. వివాహా జీవితంలో ఆటంకాలు, ప్రేమ సంబంధం బలపడే అవకాశం ఉంది. రోజు వారీ ఆదాయం పెరిగే పరిస్థితి ఉంటుంది. భాగస్వామ్య పనులలో పురోగతి సాధ్యమవుతోంది. కోపాన్ని నియంత్రించుకోవాలి.
సింహం:
ఈ రాశుల వారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. పని సమయం మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం పట్ట శ్రద్ద అవసరం. ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కంటికి సంబంధించిన విషయాల్లో అప్రమత్తత అవసరం.
కన్య రాశి:
ఈ రాశి వారికి ధైర్యం పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో ఆనందం వెల్లి విరుస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. చదువులో ఆటంకం ఏర్పడవచ్చు. పిల్లల వైపు నుండి ఆందోళన కలిగించే పరిస్థితి ఉండవచ్చు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీరు సోదరులు, సోదరి మణుల నుండి మద్ధతు పొందవచ్చు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం.
Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
Also Read: Revanth Vs Harish Rao: తెలంగాణలో జల యుద్ధం.. రేవంత్ కాస్కో అంటూ సవాల్ విసిరిన హరీశ్ రావు
Also Read: CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. కేసీఆర్, కేటీఆర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook