Mantra Jaap for Grah Dosh: హిందూ మతంలో కొన్ని మంత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మంత్రాలకు (Mantra) జీవితంలోని అన్ని కష్టాలను తొలగించే శక్తి ఉందని నమ్ముతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, జాతకంలో ఉన్న గ్రహ దోషాలను (Grah Dosh) తొలగించడానికి ఈ మంత్రాలు చాలా ప్రభావంతమైన రెమిడీగా పరగణించబడుతుంది. జాతకంలో ఉన్న గ్రహ దోషాలను తొలగించడంలో ఉపయోగపడే కొన్ని మంత్రాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
గాయత్రీ మంత్రం
గాయత్రీ మంత్రం (Gayatri Mantra) మత గ్రంథాలు, జ్యోతిష్యం మొదలైన వాటిలో చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది మరియు అందుకే దీనిని 'మహామంత్రం' అంటారు. గాయత్రీ మంత్రం అనేక రకాల కష్టాల నుండి రక్షిస్తుంది, జీవితంలోని సమస్యలను తొలగిస్తుంది. ఆనందాన్ని మరియు శ్రేయస్సును ఇస్తుంది. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ కనీసం 11 సార్లు పూర్తి భక్తితో పఠించడం వల్ల జీవితంలో చాలా సానుకూల మార్పులు వస్తాయి. మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు ఆలోచనను సానుకూలంగా మారుస్తుంది.
ప్రభావవంతమైన ఇతర మంత్రాలు
గాయత్రీ మంత్రం, సరస్వతీ గాయత్రీ మంత్రం, దుర్గా-గాయత్రి మంత్రం, హనుమాన్-గాయత్రి మంత్రం, సూర్య-గాయత్రి మంత్రం, శని-గాయత్రి మంత్రం, గణేష్-గాయత్రి మంత్రం, శ్రీ కృష్ణ-గాయత్రి మంత్రం, విష్ణు-గాయత్రి మంత్రం, లక్ష్మీ-గాయత్రి మంత్రాలతో పాటు శివ-గాయత్రీ మంత్రం మరియు తులసి-గాయత్రీ మంత్రాలు కూడా చాలా ప్రభావవంతమైన మంత్రాలు.
మంత్రం జపించేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
>> మంత్రాన్ని జపించేటప్పుడు కూర్చున్న ప్రదేశం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. అలాగే స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకున్న తర్వాత మాత్రమే మంత్రాన్ని జపించాలి.
>> కుషా లేదా కాటన్ క్లాత్‌పై కూర్చున్నప్పుడు ఎల్లప్పుడూ మంత్రాలను జపించండి.
>> రుద్రాక్ష జపమాలతో గాయత్రీ మంత్రాన్ని జపించడం ఉత్తమం.
>> మీరు స్వయంగా మంత్రాన్ని జపించలేకపోతే, మీరు కూడా యోగ్యత కలిగిన బ్రాహ్మణుని చేత మంత్రాన్ని జపించవచ్చు.
Also Read: Venus Transit In Taurus 2022: ఈ వ్యక్తులు ధనవంతులు కావడానికి కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook