August 4th Week Festivals 2022: ఆగస్టు మాసంలోని ఈ వారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ వారంలో చాలా ముఖ్యమైన పండుగలు, వ్రతాలు ఉన్నాయి. అజ ఏకాదశి, ప్రదోష వ్రతం, భాద్రపద మాస శివరాత్రి, భాద్రపద అమావాస్య, శని అమావాస్య వంటి పండుగలు ఈ వీక్ లోనే రానున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో జరుపుకునే పోలా పండుగ, జైనులు చేసుకునే పర్యూషన్ ఫెస్టివల్ కూడా ఈ వారంలోనే వస్తుంది. అందుకే ఆగస్టు నాలుగో వారానికి అంత ప్రాధాన్యత. ఈ వారంలో వచ్చే పండుగల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఆగష్టు 23, మంగళవారం: అజ ఏకాదశి వ్రతం, పర్యూషన్ పండుగ
అజ ఏకాదశి వ్రతం 2022: భాద్రపద మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశినే అజ ఏకాదశి అంటారు. దీనిని ఈ ఏడాది ఆగస్టు 23, మంగళవారం జరుపుకోనున్నారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు.
పర్యూషన్ పండుగ 2022: జైనుల జరుపుకునే ముఖ్య పండుగలలో పర్యూషన్ పండుగ ఒకటి. ఇది కూడా ఆగస్టు 23న ప్రారంభమవుతుంది. ఇది 8 నుండి 10 రోజులు జరుపుకునే పండుగ. దీనిని భాద్రపద మాసంలో జరుపుకుంటారు.
ఆగస్టు 24, బుధవారం: ప్రదోష వ్రతం
ప్రదోష వ్రతం 2022: భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతాన్ని జరుపుకోనున్నారు. ఈసారి ఇది ఆగస్టు 24వ తేదీ, బుధవారం నాడు వస్తుంది. దీనినే బుధ ప్రదోష వ్రతం అని కూడా అంటారు. ఈ రోజున శివుడిని పూజిస్తారు.
ఆగష్టు 25, గురువారం: నెలవారీ శివరాత్రి
భాద్రపద శివరాత్రి 2022: మాస శివరాత్రి భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ రోజున శివుడిని పూజిస్తారు. ఈసారి భాద్రపద శివరాత్రి ఆగస్టు 25న వస్తుంది.
ఆగస్ట్ 27, శనివారం: భాద్రపద అమావాస్య, పిథోరి అమావాస్య, పోలా, శని అమావాస్య
శని అమావాస్య 2022: భాద్రపద మాస అమావాస్య ఆగస్టు 27వ తేదీ శనివారం వస్తుంది. దీనినే శని అమావాస్య, పిథోరి అమావాస్య, శనిశ్చరి అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున నదుల్లో స్నానం చేసి దానం చేసే సంప్రదాయం ఉంది. శని అమావాస్య నాడు శని దేవుడిని పూజించడం వల్ల దోషాలు తొలగిపోతాయి.
పోలా పండుగ 2022: ఆగస్టు 27న పోలా పండుగ జరుపుకుంటారు. ఈ రోజున ఎద్దులను పూజిస్తారు. ఈ పండుగను ప్రధానంగా మహారాష్ట్ర మరియు ఛత్తీస్‌గఢ్‌లలో జరుపుకుంటారు.
Also Read: Budh Gochar 2022: బుధుడు కన్యా రాశి ప్రవేశం, కొన్ని గంటల్లో మారనున్న ఈ రాశుల అదృష్టం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook