Eid UL Adha Festival Date & Time: బక్రీద్ ఎప్పుడు..? ఎందుకు..? ఎలా జరుపుకుంటారు..? పండుగ నేపధ్యమేంటి..?

Bakrid 2023: ముస్లింల పవిత్ర పండుగలు రెండే రెండు. ఒకటి ఈదుల్ ఫిత్ర్ లేదా రంజాన్ కాగా మరొకటి ఈదుల్ అజ్హా లేదా బక్రీద్. ఇప్పుడు యావత్ ప్రపంచ ముస్లింలు బక్రీద్ ఏర్పాట్లలో ఉన్నారు. బక్రీద్ పండుగ ఎప్పుడు, ఎలా జరుపుకుంటారు, నేపధ్యమేంటనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 24, 2023, 01:49 PM IST
Eid UL Adha Festival Date & Time: బక్రీద్ ఎప్పుడు..? ఎందుకు..? ఎలా జరుపుకుంటారు..? పండుగ నేపధ్యమేంటి..?

Bakrid 2023 Date, Time and Significance: ప్రతి యేటా రంజాన్ పండుగకు దాదాపు 2 నెలల విరామంలో బక్రీద్ పండుగ వస్తుంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ నెలలో బక్రీద్ లేదా ఈదుల్ అజ్హా జరుపుకుంటారు. బక్రీద్ అనేది త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఇస్లామిక్ క్యాలెండర్‌లో జిల్‌హజ్ నెల 10వ రోజు బక్రీద్ పండుగ జరుపుకుంటారు. రంజాన్ నెల ముగిసిన 70 రోజులకు ఈదుల్ అజ్హా పండుగ ఉంటుంది. ఇస్లామిక్ చరిత్ర ప్రకారం విశ్వాసాల ప్రకారం ఈదుల్ అజ్హా అనేది త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. యావత్ ప్రపంచ ముస్లింలు బక్రీద్ పండుగను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్ర కూడా ఇదే నెలలో అంటే బక్రీద్ సందర్భంలోనే ఉంటుంది. ఈ ఏడాది బక్రీద్ ఎప్పుడనే విషయంలో మొన్నటి వరకూ ఉన్న సందిగ్దత తొలగింది. అసలు బక్రీద్ పండుగంటే ఏంటి, ఈ పండుగ నేపధ్యమేంటో తెలుసుకుందాం..

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం హిజ్రీ క్యాలెండర్ అనేది పూర్తిగా చంద్రమానంపై ఆధారపడి ఉంటుంది. అంటే ముస్లింలు ఆచరించేది లూనార్ క్యాలెండర్. చంద్రుని చూసిన తరువాత బక్రీద్ కచ్చితంగా ఎప్పుడనేది నిర్ణయించబడుతుంది. జిల్ హజ్ నెల ఎప్పుడు ప్రారంభమైందో తెలిస్తే బక్రీద్ ఎప్పుడనేది తెలిసిపోతుంది. జూన్ 19వ తేదీన చంద్ర దర్శనమైంది. దీనినే జిల్ హజ్ చంద్రుడంటారు. చంద్రుడి కన్పించిన మరుసటి రోజు నుంచి జిల్ హజ్ నెల ప్రారంభమైంది. జిల్ హజ్ మాసంలో పదవ రోజు బక్రీద్ పండుగ. అంటే జూన్ 29వ తేదీన బక్రీద్ పండుగ జరుపుకుంటారు. 

Also Read: Petrol, Diesel Prices: వాహనదారులకు గుడ్ న్యూస్..పెట్రోల్, డీజిల్ ధరలపై భారీ తగ్గింపు

బక్రీద్ ఎందుకు జరుపుకుంటారు

బక్రీద్ లేదా ఈదుల్ అజ్హా పండుగను త్యాగానికి అంటే ఖుర్బానీకు ప్రతీకగా జరుపుకుంటారు. ఇస్లాంలో దీనికి సంబంధించి చాలా ప్రాధాన్యత ఉంది. ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం అప్పటి ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం సమయంలో ఖుర్బానీ ఇచ్చే పరంపర ప్రారంభమైంది. ఒకసారి ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాంకు అల్లాహ్ పరీక్ష పెడతాడు. తనకిష్టమైన వస్తువును త్యజించమని కోరగా, తన ఒక్కగానొక్క కొడుకును ఖుర్బానీ ఇచ్చేందుకు సిద్ధమౌతారు. 

వాస్తవానికి అల్లాహ్ ఇబ్రహీంను అతని కొడుకుని త్యాగం చేయమని కోరడు. అతనికిష్టమైన దానికి వదులుకోమని ఆదేశిస్తాడు. దాంతో ఇబ్రహీం అలైహిస్సలాం ఆలోచనలో పడిపోతారు. ఇష్టమైంది ఏది ఖుర్బానీ ఇవ్వాలా అని. చివరికి తనకిష్టమైంది,తాను ఎక్కువగా ప్రేమించేది తన ఒక్కగానొక్క కొడుకునే అని గ్రహించి కొడుకును ఖుర్బానీ ఇచ్చేందుకు బయలుదేరుతాడు. ఖుర్బానీ ఇచ్చేటప్పుడు కన్న కొడుకు ప్రేమ గుర్తొచ్చి చేతులు ఆగిపోకుండా ఉండేందుకు కళ్లకు గంతలు కట్టుకుంటారు. అలా కళ్లకు గంతలు కట్టుకునే ఖుర్బానీ ముగిస్తాడు. 

ఆ తరువాత కళ్లు తెరిచి చూసేసరికి కొడుకు క్షేమంగా ఉంటాడు. కొడుకు స్థానంలో ఓ పొట్టేలు లాంటి జంతువు పడి ఉంటుంది. ఇబ్రహీం అలైహిస్సలాం త్యాగనిరతికి, సంకల్పానికి మెచ్చి ప్రసన్నుడైన అల్లాహ్ కొడుకుకి జీవనదానం ప్రసాదిస్తాడు. అప్పట్నించి ప్రతియేటా జిల్ హజ్ పదవరోజున బక్రీద్ పండుగ సందర్భంగా పొట్టేలు, ఒంటె వంటి జంతువుల్ని ఖుర్బానీ ఇస్తుంటారు. 

ఖుర్బానీ ఇచ్చిన జంతువు మాంసాన్ని మూడు భాగాలుగా చేస్తారు. ఒక భాగం కుటుంబసభ్యులకు, రెండవ భాగం బంధుమిత్రులకు, మూడవ భాగం నిరుపేదలకు తప్పకుండా పంచాలి. అప్పుడే ఖుర్బానీ పరమార్ధం పూర్తవుతుంది. 

Also Read: Mangal Gochar 2023: నీచభంగ్ రాజయోగంతో మారనున్న ఈ రాశుల అదృష్టం.. మీది ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News