Budh Margi 2022: అక్టోబరు 2న కదలికలోకి బుధుడు.. ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే..

Budh Margi 2022: జ్యోతిష్యంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. బుధుడిని గ్రహాల రాకుమారుడి అని కూడా అంటారు. బుధుడు సంచారం వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2022, 12:52 PM IST
Budh Margi 2022: అక్టోబరు 2న కదలికలోకి బుధుడు.. ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే..

Budh Margi 2022: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజుగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో అయితే బుధుడు శుభస్థానంలో ఉంటాడో వారి అదృష్టం ప్రకాశిస్తుంది. ప్రస్తుతం బుధుడు కన్యారాశిలో తిరోగమనంలో ఉన్నాడు. అక్టోబరు 2న బుధుడు మార్గంలోకి (Budh Margi 2022) రానున్నాడు. బుధుడు కలయిక వల్ల కొన్ని రాశులవారు విపరీతమైన ప్రయోజనాన్ని పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

కర్కాటకం (Cancer): బుధుడు కదలిక కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఏదైనా వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సపోర్టు లభిస్తుంది. వ్యాపారులు లాభపడతారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. 

కన్య (Virgo): కన్యా రాశి వారికి ఈ సమయం శుభప్రదం కానుంది. ఆర్థికంగా మీరు బలపడతారు. మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఫ్యామిలీతో గడిపే అవకాశం లభిస్తుంది. విద్యారంగంతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం కలిసి వస్తుంది. 

వృశ్చిక రాశి (Scorpio):  వృశ్చిక రాశి వారికి ఈ సమయం వరమనే చెప్పాలి.  జీవిత భాగస్వామి మద్దతు మీకు  లభిస్తుంది. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. లక్ష్మీదేవి కటాక్షం వల్ల మీరు ఉద్యోగం, వ్యాపారాల్లో లాభం పొందుతారు. 

మీనరాశి (Pisces): మీన రాశి వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. మీరు ఆర్థికంగా బలపడతారు. ఏదైనా  కొత్త పని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

Also Read: October Grah Gochar 2022: అక్టోబరులో అంతరిక్షంలో అల్లకల్లోలం...రాశిని మార్చబోతున్న 5 గ్రహాలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.       

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu        

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News