Chanakya Niti in Telugu: ఆచార్య చాణిక్యుడు (Acharya chanakya) గురించి మనందరికీ తెలిసిందే. ఎందుకంటే అతడి కీర్తి అలాంటిది మరి. చాణిక్యుడిని విష్ణుగుప్తుడు, కౌటిల్యుడు అనే పేర్లతో పిలస్తారు. ఈయన సలహాలతోనే చంద్రగుప్త మౌర్యుడు నంద వంశానికి చక్రవర్తి అయ్యాడు. ప్రపంచంలోని గొప్ప పండితుల్లో చాణిక్యుడు ఒకరు. మనిషి జీవితానికి మార్గదర్శకంగా నిలిచే ఎన్నో విషయాలను ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో (Chanakya Niti) స్పష్టంగా వివరించారు. ఏడు రకాల జీవులు నిద్రిస్తున్నప్పుడు లేపకూడదని..వాటికి నిద్రాభంగం కలిగిస్తే.. అది మీకే ఇబ్బందులు తెస్తుందని చాణిక్యుడు తన చాణక్యనీతిలో వివరించారు.
1. రాజు లేదా పాలకుడిని లేదా అధికారిని ఎప్పుడూ నిద్ర నుండి లేపకండి. ఎందుకంటే వారి ఆగ్రహానికి గురికావచ్చు. రాజు అయితే మరణశిక్ష విధిస్తాడు. అధికారి అయితే మిమ్మిల్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు.
2. సింహం నిద్రిస్తుంటే, దానిని లేపడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. అలా చేయడమంటే మీ మరణాన్ని మీరు ఆహ్వానించినట్లే లెక్క.
3. నిద్రపోతున్న లేదా ప్రశాంతంగా ఉన్న పామును ఆటపట్టించడం అనేది మీ ఆయుష్షు మూడిందనడానికి సంకేతం.
4. నిద్రపోతున్న శిశువును మేల్కొలపడం కొన్నిసార్లు మీ తలనొప్పికి కారణమవుతుంది. పసికందును ఎప్పుడైతే నిద్రలేపుతారో ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు.
5. ఏదైనా హింసాత్మక జంతువు నిద్రపోతున్నప్పుడు దానిని లేపకూడదు. అది మేల్కొనగానే కోపంతో మీపై దాడి చేయవచ్చు.
6. తెలివి తక్కువ వ్యక్తి లేదా మూర్ఖులని మేల్కొలపడం కూడా మీకు భారంగా ఉంటుంది.
7. ప్రశాంతంగా నిద్రపోతున్న తేలును ఎప్పుడూ నిద్రలేపవద్దు. అది మీ ప్రాణానికే ప్రమాదం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Chanakya Niti: ఈ 7 రకాల జీవులను మీరు నిద్ర లేపారో.. మీ చావును మీరు కొనితెచ్చుకున్నట్లే..!