Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya) అనేక జీవన విధానాలను చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మనం చాలా మంచి జీవితాన్ని గడపవచ్చు. కొన్నిసార్లు మనం తెలిసో లేదా తెలియక కొంతమంది వ్యక్తులతో సహవాసం చేయడం వల్ల మన లైఫ్ బాధలతో నిండిపోతుంది. అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండటం మంచిది
ఆచార్య చాణక్యుడి మాటలు చేదుగా అనిపించినా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ విధానాలను అనుసరించడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చు. ఆచార్య చాణక్యుడు కొంతమందికి దూరంగా ఉండమని చెప్పాడు. లేకపోతే, ఈ వ్యక్తుల సహవాసం సంతోషంగా ఉన్న మన జీవితంలో దుఃఖాన్ని నింపుతుంది.
>> గురువు ఎంత సమర్ధుడైనా, అతని కీర్తి ఎంత గొప్పదైనా... అతని శిష్యులలో ఒకరు మూర్ఖుడైతే గురువు జీవితం ఇబ్బందిగా ఉంటుంది. మూర్ఖుడైన శిష్యుడు గురువును అవమానపరచడమే కాకుండా, తన మూర్ఖత్వంతో గురువు జీవితంలో అనేక అడ్డంకులు తెస్తాడు.
>> అన్ని సమయాలలో సంతోషంగా ఉండే వ్యక్తి... అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులతో సహవాసం చేస్తే.. అతడు ఏదో ఒక సమయంలోనై నిరాశకు గురవుతాడు. తద్వారా అతని జీవితం కూడా దుఃఖంతో నిండిపోతుంది.
>> మంచి నడవడిక, విద్యావంతులైన స్త్రీ యొక్క సహవాసం ఒక పురుషుని జీవితంలో విజయం మరియు సంతోషాన్ని నింపుతుంది. అదే భార్య దుర్మార్గురాలైతే అతడి సుఖాన్ని హరించివేస్తుంది. లైఫ్ నిండి బాధలు తప్ప ఏమీ ఉండవు.
Also Read: Money Dreams: కలలో ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయా? అయితే మీ లైఫ్ టర్న్ అయినట్లే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.