Chandra Grahan 2023: మొదటి చంద్ర గ్రహణం విశిష్టత, సూర్య, చంద్ర గ్రహణాల వివరాలు!

Chandra Grahan in 2023 In India: భారతదేశంలో మొదటి చంద్రగ్రహణం మే 5 ఏర్పడబోతోంది. అయితే ఈ క్రమంలో ఇతర దేశాలతో పాటు భారత్‌పై కూడా ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎంత వరకు ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2023, 04:51 PM IST
Chandra Grahan 2023:  మొదటి చంద్ర గ్రహణం విశిష్టత, సూర్య, చంద్ర గ్రహణాల వివరాలు!

Lunar Eclipse In 2023 In India: ప్రపంచ వ్యాప్తంగా సూర్య, చంద్రగ్రహణాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సైన్స్ కోణం వీటిని  ఖగోళ దృగ్విషయంగా పేర్కొన్నారు. అందుకే దీనిపై అనేక పెద్ద శాస్త్రీయ పరిశోధనలు జరుగుతాయి. అయితే ఈ గ్రహణాలకు అనేక రకాల నమ్మకాలు ఉన్నాయి. గ్రహణ సమయంలో, పూజలు, శుభకార్యాలు, వంటలు కార్యక్రమాలు చేయడం నిశిద్ధం. అయితే ఈ క్రమంలో గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 2023లో జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. వీటిలో రెండు చంద్రగ్రహణాలు, రెండు సూర్యగ్రహణాలు ఉంటాయి. అయితే రేపు ఏర్పడబోయే సూర్యగ్రహానికి ఎలాంటి ప్రాముఖ్య ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం గురువారం ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం ఉదయం 7:04 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:29 గంటలకు ముగిసే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇంతక ముందు గ్రహణాలాగా రేపు ఏర్పడబోయే గ్రహణం కనిపించదు. కాబట్టి రేపు ఏర్పడబోయే సూర్యగ్రహణానికి సూతక కాలం ఉండదని నిపుణులు చెబుతున్నారు. సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం 14 అక్టోబర్ 2023 శనివారం జరుగుతుంది. ఈ గ్రహణం పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటికా, అంటార్కిటికాలో కనిపిస్తుంది.

Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?

చంద్ర గ్రహణం:
ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మే 5 శుక్రవారం ఏర్పడబోతోంది. భారత కాలమానం ప్రకారం..రాత్రి 8:45 గంటలకు ప్రారంభమై రాత్రి 1:00 గంటలకు ముగుస్తుంది. సూర్యగ్రహణం లాగా ఏర్పడబోయే చంద్రగ్రహణం కూడా కనిపించదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ గ్రహణం కనిపించకపోయిన సూతక్ కాలం 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. నూర్య, చంద్ర గ్రహణాలు రెండు అక్టోబర్ 29 ఏర్పడబోతున్నాయి. ఈ గ్రహణాలు రాత్రి 1:06 గంటలకు ప్రారంభమై 2:22 గంటలకు ముగుస్తాయి. అయితే భారత్‌లో ఈ  చంద్ర గ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుంది. కాబట్టి దీనికి సూతక కాలం కూడా చెల్లుతుంది.

చంద్రగ్రహణం అంటే ఏమిటి?
సూర్యగ్రహణం లాగానే చంద్రగ్రహణం కూడా ఖగోళ సంబంధమైన సంఘటన. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. ఈ ప్రక్రియలో చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే రేఖలో వచ్చే సమయం వస్తుంది. దీని కారణంగా సూర్యుని కాంతి భూమిపై పడుతుంది. ఇలా జరిగే సంఘటననే చంద్ర గ్రహణం అని అంటారు.

Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News