Astrology Tips: ఏ రాశివారికి ఏ రాశితో జత కుదురుతుంది, జ్యోతిష్యశాస్త్రం ఏం చెబుతోంది.

Astrology Tips: జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి రాశి గురించి, ఆ రాశి జాతకుల జాతకం ఉంటుంది. కెరీర్, ఆస్థి,జీవిత భాగస్వామి ఇలా సమస్తం ఉంటుంది. ఏ రాశికి ఏ రాశితో జత కలుస్తుందో కూడా ఉంది. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 17, 2022, 03:14 PM IST
Astrology Tips: ఏ రాశివారికి ఏ రాశితో జత కుదురుతుంది, జ్యోతిష్యశాస్త్రం ఏం చెబుతోంది.

Astrology Tips: జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి రాశి గురించి, ఆ రాశి జాతకుల జాతకం ఉంటుంది. కెరీర్, ఆస్థి,జీవిత భాగస్వామి ఇలా సమస్తం ఉంటుంది. ఏ రాశికి ఏ రాశితో జత కలుస్తుందో కూడా ఉంది. ఆ వివరాలు మీ కోసం..

జ్యోతిష్యశాస్త్రంలో రాశులను బట్టి సర్వస్వం తెలుసుకోవచ్చంటారు పండితులు. కేవలం వ్యక్తి వ్యక్తిత్వమే కాకుండా అన్ని సీక్రెట్ విషయాలు తెలిసిపోతుందంటారు. ప్రతిరాశికి ఓ గురు గ్రహం ఉంటుంది. ఆ ప్రభావం ఆ రాశి జాతకులపై స్పష్టంగా కన్పిస్తుంది. గ్రహాల మధ్య కూడా శతృత్వం, మిత్రత్వం ఉంటుంది. అందుకే రాశు మధ్య కూడా అదే పరిస్థితి నెలకొంటుంది. అందుకే పెళ్లి సమయంలో రాశుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం అవసరమౌతోంది. ఎందుకంటే మీ జీవిత భాగస్వామి రాశి గ్రహాల మధ్య శత్రుత్వముంటే..జాతకాలు కూడా కలవవు. కుండలి మ్యాచింగ్‌తో పాటు రాశుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. పెళ్లి లేదా ప్రేమ వ్యవహారాల్లో ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది, ఏ రాశికి ఏ రాశి సరైన భాగస్వామి కాగలరనే వివరాలు జ్యోతిష్యంలో స్పష్టంగా ఉన్నాయి. 

మేషరాశి వారికి మిధునం, తుల రాశి వారితో మంచి సంబంధాలు కొనసాగగలవు. అటు వృషభ రాశివారికి మకరం, వృశ్చికంతో మంచి జీవిత భాగస్వామ్య సంబంధాలుంటాయి. మిధున రాశివారికి వృషభం తుల, సింహ రాశులతో మంచి సంబందాలుంటాయి. మిత్రత్వం కొనసాగుతుంది. ఇక కర్కాటక రాశివారికి సింహం, మేషం, ధనస్సు రాశివారు మంచి జీవిత భాగస్వాములు కాగలరు. 

సింహరాశివారికి ధనస్సు రాశి జాతకం చాలా మంచిది. ధనస్సు రాశితో పాటు కర్కాకటం, మేషం, వృశ్చికం, మీన రాశుల్నించి కూడా జీవిత భాగస్వామి ఎంపిక చేయవచ్చు. ఇక కన్యా రాశివారికి మకరం లేదా వృషభ రాశి జాతకులు మంచి జీవిత భాగస్వాములౌతారు. తుల రాశివారికి కుంభరాశి జాతకులు బెస్ట్ పార్టనర్ అవుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మేషం, మిధున, కన్యా, మకర రాశుల్నించి కూడా జీవిత భాగస్వామి ఎంచుకోవచ్చు.

వృశ్చిక రాశివారికి వృషభం, ధనస్సు, కర్కాటకం, మీన రాశివారు మంచి జీవిత భాగస్వాములు అవుతారు. ధనస్సు రాశివారికి సింహం, మేష రాశి జాతకులైతే మంచి జీవిత భాగస్వామ్యులౌతారు. మకర రాశివారికి వృశ్చిక రాశివారు మంచి భాగస్వాములౌతారు. వృషభం, మిధున, కర్కాటకం, తుల రాశి వారితో మంచి సంబంధాలుంటాయి. కుంభ రాశివారు సింహం, వృషభం రాశి వారితో మంచి సంబంధాలుంటాయి. మీనరాశివారికి కర్కాటం, మేషం, వృశ్చిక రాశివారికి జీవిత భాగస్వామిలౌతారు. 

Also read: Vastu Tips: ఇంట్లో నెమలి పించాన్ని ఏ దిశలో ఉంచాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News