Death Signs: మరణం గురించి విన్నప్పుడు ఏదో తెలియని భయం కలుగుతుంది. అదే సమయంలో మరణం గురించి ప్రతి ఒక్కరికీ చింత కూడా ఉంటుంది. మరణం సమీపిస్తున్నప్పుుడు లేదా మృత్యువు దగ్గరలో ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది, గరుడ పురాణంలో దీని గురించి ఉన్న ప్రస్తావన ఏంటనేది తెలుసుకుందాం..
ఏ శ్వాస చివరిదో ఎవరికి తెలుసు. అందుకే మరణం అంటే అందరికీ భయమే. మృత్యువు గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మరణ సమయంలో ఎలా ఉంటుంది, మరణం ముందే ఏమైనా సంకేతిస్తుందా, మత గ్రంధాల్లో మరణం గురించి ఏం రాసి ఉందనే విషయాలపై ఆసక్తి ఎక్కువే ఉంటుంది. ఇందులో అంటే మత గ్రంధాల్లో మృత్యవు గురించి మరణానంతరం ఆత్మ చేసే ప్రయాణం, పునర్జన్మ విషయాలన్నీ ఉంటాయి. మృత్యువుకు ముందు వ్యక్తి శరీరంలో ఏ మార్పులు వస్తాయి, ఎలా ఉంటుందనేది గరుడ పురాణంలో ప్రస్తావన ఉంది.
మరణానికి ముందు లభించే సంకేతాలు
మృత్యువుకు ముందు వ్యక్తికి కొన్ని సంకేతాలు లభిస్తాయి. మరణించడానికి కొన్ని నెలల ముందు నుంచే అతని శరీరంలోని పలు భాగాలపై ప్రభావం కన్పిస్తుంటుంది. వ్యక్తి నాలుక పనిచేయదు. రుచి తెలుసుకోలేడు. మాట్లాడటంలో కష్టం ఎదురౌతుంది.
చావు దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి సూర్య, చంద్రుల తేజం కన్పించదు. మరణానికి ముందు వ్యక్తి శరీరంలో తేలికపాటి పసుపురంగు లేదా తెల్లదనం వస్తుంది. శరీరంలో రక్తం తగ్గిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చనిపోయే వ్యక్తికి నీడ కూడా కన్పించదట. ఇది జరిగిందంటే ఆ వ్యక్తికి చావు అతి సమీపంలో ఉందని అర్ధం.
అటు చనిపోవడానికి 2-3 రోజుల ముందు నుంచే వ్యక్తికి చుట్టూ అదృశ్య శక్తులేవో ఉన్నట్టుగా ఉంటుంది. యమదూతలు కన్పిస్తారని అంటారు. తనకు దగ్గరలో ఉన్న మనుష్యులు కూడా కన్పించరు. ఎందుకంటే ఆ వ్యక్తి అప్పటికే యమదూతల్ని చూసి జడుసుకుంటాడు. దీంతోపాటు మరణించడానికి ముందు వ్యక్తి శరీరం నుంచి విచిత్రమైన వాసన కూడా వస్తుంటుంది. గరుడ పురాణం ప్రకారం మరణానికి 24 గంటల ముందే వ్యక్తికి అద్దంలో తన ముఖం కన్పించదట. అటు నీళ్లలో, ఆయిల్ వంటి వస్తువుల్లో కూడా ప్రతిబింబం కన్పించదట.
Also read: Ithr Benefits: అత్తరుతో ఇలా పూజలు చేస్తే..ఇక డబ్బే డబ్బు, కష్టాలన్నీ దూరం
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook