Dreams Meaning: మీకు కలలో అవి కన్పిస్తుంటే..అప్రమత్తం కావాలి, తస్మాత్ జాగ్రత్త

Dreams Meaning: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో..స్వప్నశాస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. నిద్రలో వచ్చే కలలకు అర్ధముంటుంది. శుభం కావచ్చు లేదా అశుభం కావచ్చు. మీకు నిద్రలో అలాంటి కలలు వస్తే..తస్మాత్ జాగ్రత్త మరి

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 22, 2022, 11:21 PM IST
Dreams Meaning: మీకు కలలో అవి కన్పిస్తుంటే..అప్రమత్తం కావాలి, తస్మాత్ జాగ్రత్త

Dreams Meaning: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో..స్వప్నశాస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. నిద్రలో వచ్చే కలలకు అర్ధముంటుంది. శుభం కావచ్చు లేదా అశుభం కావచ్చు. మీకు నిద్రలో అలాంటి కలలు వస్తే..తస్మాత్ జాగ్రత్త మరి

కలల్లో మంచివీ ఉంటాయి. చెడువీ ఉంటాయి. చాలా సందర్భాల్లో మనకు వచ్చే కలల ద్వారా ప్రశాంతత లభిస్తుంటుంది. మరికొన్ని సందర్భాల్లో కలలు భయం గొలుపుతుంటాయి. కలలనేవి భగవంతుడు పంపించే సందేశాలంటారు. ఇవి చెడు కావచ్చు లేదా మంచివి కావచ్చు. ఈ కలల్ని సంకేతాలుగా భావించి అప్రమత్తమవ్వాలి. ఏ కలలు వస్తే ఏ పరిణామాలుంటాయో తెలుసుకుందాం..

కలలో పెద్ద పొట్ట కన్పిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పెద్ద పొట్ట కన్పించడమంటే అర్ధం పెద్ద పెద్ద ఆశలు. కానీ చిన్న పొట్ట కన్పిస్తే మాత్రం బ్యాడ్ టైమ్ వస్తుందని అర్ధం. జాగ్రత్త పడాలి. మిత్రులు కూడా మోసం చేసే అవకాశముంటుంది. 

మీకు కలలో ఎవరైన మహిళ గర్భస్రావం కన్పిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ఇది భవిష్యత్తులో మీ ప్రణాళికలు విఫలమౌతాయనేందుకు సంకేతాలు. తొందరపాటులో తీసుకున్న నిర్ణయాలకు ఫలితం అనుభవించాల్సిందనే సంకేతమిది. 

మీరు కలలో..ఎవో లెక్కలేసుకుంటూ మీరే కన్పిస్తే ఇది శుభ సూచకమే. మీరు లాభా నష్టాల్ని బేరీజు వేసుకుంటున్నారని అర్ధం. డబ్బులు, ఎనర్జీ వృధా చేయకూడదని సంకేతం ఇది. 

మీకు కలలో ఎవరైనై హంతకుడు కన్పిస్తే జాగ్రత్త పడాలి. కలలో హంతకుడిని చూడటమంటే..సీరియస్ హెచ్చరిక ఇది. మీ వ్యక్తిత్వానికి ఎవరో భంగం కల్గించేందుకు ప్రయత్నిస్తున్నారని అర్ధం. మీరు మీకు చేరువైనవారినెవరినో అంతం చేయాలనుకుంటున్నారని కూడా అర్ధం. 

మీకు కలలో గాడిద కన్పిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. గాడిద శబ్దాన్ని మూర్ఖులకు సూచకంగా చెబుతారు. ఎవరో మిమ్మల్ని మూర్ఖుల్ని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అర్ధం. ఇతరుల వ్యవహారాల్ని మీ నెత్తిన వేసుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి

Also read: Lakshmi Devi Blessings: సెప్టెంబర్ మిగిలిన 8 రోజుల్లో ఆ నాలుగు రాశులకు ఏం జరగనుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News