Rainy Season: వర్షాకాలం ప్రారంభమైంది. ఆధ్యాత్మికంగా అంటే హిందూమతం ప్రకారం శ్రావణ మాసం. జ్యోతిష్యం ప్రకారం శ్రావణ మాసానికి అధిక ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ నెలలో ఇలా చేస్తే అంతులేని సంపద వచ్చి పడుతుందట.
వర్షాకాలం అంటే హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసం ప్రారంభమైందని అర్ధం. జ్యోతిష్యశాస్త్రంలో ఈ నెలకు అత్యధిక మహత్యముంది. శ్రావణమాసం అత్యంత పవిత్రమైంది. వర్షాకాలంలో కొన్ని పద్ధతులు పాటిస్తే ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు డబ్బుకు కొదవుండదని తెలుస్తోంది. వాస్తుశాస్త్రంలో దీనికి సంబంధించి చాలా ఉపాయాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..
వర్షం నీళ్లతో ఉపాయాలు..ఉపయోగాలు
వాస్తుశాస్త్రం ప్రకారం మీరు రుణగ్రస్థులైతే..వర్షం నీళ్లతో ఆ రుణాన్ని తీర్చవచ్చంటున్నారు. నిల్వ చేసిన వర్షం నీటిలో ఒక గ్లాసు పాలు కలిపి స్నానం చేస్తే అప్పులు తీరతాయని ఓ నమ్మకముంది. ఇక మరోవైపు వర్షం నీళ్లతో లక్ష్మీదేవిని అభిషేకిస్తే..అంతులేని డబ్బులు లభిస్తాయంటున్నారు. దీనికోసం శుక్రవారం నాడు వర్షం నీళ్లను ఓ ఇత్తడి గిన్నెలో తీసుకుని లక్ష్మీదేవికి అభిషేకం చేయాలి. లక్ష్మీదేవికి కమలం సమర్పించాలి. చాలామంది ఆర్ధిక ఇబ్బందులతో సతమతమౌతుంటారు. ఈ పరిస్థితుల్లో వర్షాకాలంలో చేసే ఉపాయాలు మంచి ఫలితాలనిస్తాయి. దీనికోసం ముందుగా మట్టికుండలో వర్షం నీళ్లు నింపాలి. కుండను ఇంటికి ఉత్తర దిక్కున ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్ధిక సమస్యలు దూరమౌతాయి.
చాలామందికి పెళ్లి తరువాత జీవితంలో ఇబ్బందులు వస్తుంటాయి. ఇద్దరి మధ్య సంబంధం సరిగా ఉండకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఇరువురి మధ్య సంబంధంలో ప్రేమ పెంచేందుకు వర్షం నీళ్లు ఉపయోగపడతాయి. ఇత్తడి బాటిల్లో వర్షం నీళ్ల నింపి..కొన్నిరోజులపాటు అలానే బెడ్రూమ్లో ఉంచాలి.
Also read: Surya Dev Remedies: ఆదివారం నాడు ఈ వస్తువులు దానం చేస్తే.. మీకు డబ్బుకు లోటు ఉండదు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook