Fourth Wave Scare: దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు...మెుత్తం కేసులన్నంటే..?

India Covid-19 Update: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. తాజాగా 7,946 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ తో 37 మంది మరణించారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 1, 2022, 10:23 AM IST
  • దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం
  • కొత్తగా 7,946 కరోనా కేసులు
  • 98.67 శాతానికి చేరిన రికవరీ రేటు
Fourth Wave Scare: దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు...మెుత్తం కేసులన్నంటే..?

Covid-19 Cases Today: దేశంలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. క్రితం రోజుతో పోలిస్తే కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,946 మందికి వైరస్ పాజిటివ్ (Corona Cases in India) గా నిర్ధారణ అయింది. మహమ్మారితో మరో 37 మంది మృత్యువాత పడ్డారు. నిన్న  9,828 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.67 శాతానికి చేరింది. 

దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 62,748గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 2,66,477మందికి కరోనా టెస్టులు చేశారు. భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం 12,90,443 మందికి వ్యాక్సిన్ (Covid-19 Vaccination in India) వేశారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 2,12,52,83,259 కు చేరింది. 

వరల్డ్ వైడ్ గా కరోనా కల్లోలం కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 6,52,816 కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల్లో వైరస్ తో 1,942 మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్ లో మహమ్మారి విజృంభిస్తోంది. అక్కడ కొత్తగా 1,39,582 కేసులు, 311 మరణాలు నమోదయ్యాయి.  

Also Read: NEET Answer Key 2022: నీట్ అధికారిక ఆన్సర్ కీ, ఓఎంఆర్ షీట్స్ విడుదల, డౌన్‌లోడ్ ఎలా 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News