Pushya Nakshtra 2024: రేపే గురు పుష్య యోగం.. ఇలా చేస్తే మీకు అఖండ ధనయోగం..

Astrology: రేపు పవిత్రమైన గురు పుష్య యోగం ఏర్పడబోతుంది. ఈరోజున మీరు కొన్ని పరిహారాలు చేయడం వల్ల మీరు అనుకున్నది జరుగుతుంది. అదేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2024, 08:56 PM IST
Pushya Nakshtra 2024: రేపే గురు పుష్య యోగం.. ఇలా చేస్తే మీకు అఖండ ధనయోగం..

Guru Pushya Nakshtra 2024 Tomorrow: జ్యోతిష్యశాస్త్రంలో గురు పుష్య నక్షత్ర యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గురువారం నాడు పుష్యనక్షత్రం కనిపిస్తే దానిని గురు పుష్యనక్షత్ర అంటారు. ఈరోజు శుభకార్యం చేసుకోవడానికి, ఏదైనా వస్తువులను కొనుగోలు చేయడానికి చాలా మంచిది. ఈ గురు పుష్య యోగం రేపు (ఫిబ్రవరి 22)న రాబోతుంది. సాధారణంగా గురవారం నాడు బృహస్పతిని పూజిస్తారు. ఆయన చెడు ప్రభావం మీపై పడకుండా ఉండాలంటే రేపు పసుపు నీలమణి లేదా పసుపు పుష్పరాగము వంటి ఉంగరాలు ధరించడం మంచిది. 

ఈరోజున ఇలా చేస్తే మీకే లాభం..
>> గురు పుష్య నక్షత్రం రోజున శుభ కార్యాలు ప్రారంభించవచ్చు, ఇది చాలా పవిత్రమైన రోజు. గురువారం ఉపవాసం ఉండటం కూడా చాలా మంచిది.
>> కొత్త వస్తువులు, బంగారు ఆభరణాలు, రత్నాలు మొదలైన వాటిని కొనడానికి కూడా ఈ రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
>> ఇంటి పని మెుదలుపెట్టడానికి లేదా ఏదైనా నిర్మాణం చేసుకోవడానికి గురు పుష్య నక్షత్రం సమయం చాలా మంచిది. 
>> ఉద్యోగాన్వేషణ, సంతానం కోరిక, వ్యాపారంలో పురోగతి, విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఈ రోజుకు అరటి చెట్టుకు శెనగపప్పు, పసుపు, కొంచెం పంచదార కలిపి నీళ్లను పోయాలి. 
>> ఈ రోజున ఓం విష్ణవే నమః అని 108 సార్లు జపించడం వల్ల ఉద్యోగం ఎదురుచూసే వారిక కోరిక నెరవేరుతోంది. 
>> ఇల్లు లేదా వెహికల్ రిజిస్ట్రేషన్ కు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. 
>> మీరు గురు పుష్య నక్షత్రంలో ఏదైనా స్టడీ కోర్సు మెదలుపెడితే బృహస్పతి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.

Also Read: Grah Gochar 2024: రాశి మారనున్న 4 పెద్ద గ్రహాలు.. ఈ రాశుల వారి ఇంట్లో లక్ష్మీదేవి తాండవమే..

Also Read: Medaram Jaggery Speciality: సమ్మక్క సారక్కకు బెల్లం ఎందుకు సమర్పిస్తారంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News