Horoscope Today 15th FEB 2022: నేటి రాశిఫలాలు.. ఈ రాశివారు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు!

Horoscope Today 15th FEB 2022: ఈ రోజు కొన్ని రాశుల వారికి అనేక విషయాల్లో కలిసి వస్తుంది. మకర రాశి కలిగి ఉన్న యువతకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మీన రాశి వారు ఆర్థికంగా బలంగా మారుతారు. అదే విధంగా సింహ రాశి వారు కోరుకున్న వారిని జీవిత భాగస్వామిగా పొందే అవకాశం ఉంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2022, 06:20 AM IST
    • 2022 ఫిబ్రవరి 15 (మంగళవారం).. మీ రాశి ఫలాలు
    • సింహరాశి వారికి కోరుకున్న జీవిత భాగస్వామిని పొందే అవకాశం
    • మకర రాశి వారు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు!
Horoscope Today 15th FEB 2022: నేటి రాశిఫలాలు.. ఈ రాశివారు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు!

Horoscope Today 15th FEB 2022: మంగళవారం (ఫిబ్రవరి 15) అనేక రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సింహ రాశి వారికి కోరుకున్న భాగస్వామి తమ జీవితాల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తులా రాశి వారు అనవసరమైన ప్రయాణాలను మానుకోవాలి. 

మేష రాశి (Aries)

ఈ రాశి వారికి నేడు ఏదైనా ఆన్ లైన్ పనిని ప్రారంభించేందుకు ఓ ప్రణాళిక రూపొందించుకుంటారు. మీ ప్రవర్తనలో మరింత సానుకూలత ఉంటుంది. పనిని నిజాయితీగా చేస్తారు. నేడు కుటుంబంతో సరదాగా గడుపుతారు. 

వృషభ రాశి (Taurus)

నేడు ఈ రాశి గల వారు ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని లాభాలను పొందుతారు. పాల వ్యాపారాలు చేసే వారికి మంచి లాభం ఉంటుంది. మరేదైనా పెట్టుబడుల ద్వారా లాభాలను పొందవచ్చు. 

మిథున రాశి (GEMINI)

ఈ రాశి వారికి నేడు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. ఈ సమయంలో ఏదైనా ఆస్తి కొనుగోలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి పరంగా మీరు మీ పనిచేసే చోట ఆధిపత్యాన్ని నెలకొల్పుతారు. మీ పిల్లల భవిష్యత్తు గురించి చాలా ఆందోళన చెందుతారు.

కర్కాటక రాశి (Cancer) 

కర్కాటక రాశి వారు కొన్ని పనుల్లో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారాల్లో భాగస్వాములకు కొత్తగా చేర్చుకోవచ్చు. డబ్బు విషయాల్లో కొంత ఒత్తిడి తగ్గుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు ఈరోజు మంచిగా సాగుతుంది. 

సింహ రాశి (LEO)

మీ పనులన్నీ తేలిక అవుతాయి. వ్యాపారస్తులు విశేష లాభాలను పొందుతారు. శాశ్వత ఉద్యోగం కోసం చేసే వేటలో విజయం సాధిస్తారు. డబ్బు ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కొంత జాగ్రత్త అనేది ముఖ్యం. యువకులు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంది. 

కన్యా రాశి (Virgo)

స్వంత ప్రయత్నాలతో ఈ రాశి నేడు ముందుకు సాగుతారు. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది. విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్త పడాలి. కుటుంబసభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 

తులా రాశి (Libra)

ఈ రాశి వారు జీవితంలో పెద్ద బాధ్యతలను పొందే అవకాశం ఉంది. భవిష్యత్తులో పెట్టుబడులకు నేడు ముందస్తు ప్రణాళికలు వేసుకోవచ్చు. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేయిండి. ప్రత్యర్థులు మిమ్మల్ని అవమానించేందుకు ప్రయత్నిస్తారు. వృత్తిపరంగా ఈ రాశి వారు రాణిస్తారు. 

వృశ్చిక రాశి (Scorpio)

మీ రోజువారీ ఆదాయం.. గతంలో కంటే మెరుగ్గా మారుతుంది. ఇంతకు ముందెన్నడు చేయని పనికి మీరు సంకల్పిస్తారు. ముఖ్యమైన విశేషాలను ఎవరితోనూ పంచుకోవద్దు. తల్లి ఆశీర్వాదం తీసుకుంటే మీకు మరింత మేలు జరుగుతుంది. 

ధనుస్సు రాశి (Sagittarius)  

నేడు ఈ రాశి వారి ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో మార్పు సంభవించవచ్చు. ఈ రోజు మీకు చాలా మంచిగా సాగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి పెట్టేందుకు నేడు మంచి రోజు. దైవారాధన వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇంటి నుంచి బయటకు వచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 

మకర రాశి (Capricorn) 

ఈ రాశి వారికి నేడు చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థిని మెరుగుపరిచేందుతు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిఉంది. యువత కోరుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. 

కుంభ రాశి (Aquarius)

ఈ రోజు మీ జీవితంలో చాలా మార్పులు జరగవచ్చు. వ్యాపారవేత్తలు తమ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రుల సలహాలు పాటిస్తే మేలు జరుగుతుంది. అలాగే యువత పెళ్లి విషయాలు నేడు ఓ కొలిక్కి వస్తాయి. 

మీన రాశి (Pisces) 

ఈ రాశిని కలిగి ఉన్న అన్ని రంగాల వారికి నేడు కలిసొస్తుంది. ఆర్థికంగా బలంగా మారుతారు. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది. ఉద్యోగ రంగంలో సహోద్యోగుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది.  

Also Read: Horoscope Today 13th FEB 2022: నేటి రాశిఫలాలు.. వ్యాపారంలో పెట్టుబడి ఈ రాశుల వారు జాగ్రత్త ఉండాలి!

Also Read: Horoscope Today Feb 12 2022: రాశి ఫలాలు.. కెరీర్ పరంగా ఆ రాశి వారికి ఇవాళ గుడ్ న్యూస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News