Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 31, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ధనవ్యయం

Today Horoscope In Telugu 31 March 2021: రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 31న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

Last Updated : Mar 31, 2021, 02:21 PM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 31, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ధనవ్యయం

Horoscope Today 31 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 31న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈ రోజు మీకు అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని బయటకు వెళ్ళేలా చూసుకోండి. ఏదైనా కొత్తది ప్రయత్నించడంలో ఎలాంటి తప్పిదం లేదు. ఎవరేం అనుకున్నా మీరు మీలాగే నడుచుకోండి. కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వాహనాలు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటారు.

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

వృషభ రాశి
మీరు మీ జీవితాన్ని నియంత్రించుకోవాలి. మీరు కచ్చితంగా పనిని ప్రారంభించాలి. ఇతరులపై ప్రతి సందర్భంలోనూ ఆధారపడవద్దు. మీకు సహాయం అవసరమయితే, అప్పుడు మీకు చేయూత ఇచ్చేందుకు ఎవరూ ఉండరని గుర్తుంచుకోండి. ఇతరులు మీ పనులకు ప్రాధాన్యత ఇవ్వరు. బంధుమిత్రులు, సన్నిహితులతో సరదాగా గడుపుతారు.

మిథున రాశి
మీరు కొన్ని విషయాలలో మీ వైఖరి మార్చుకోవాలి. లేనిపక్షంలో ఇతరులు సైతం మీ అభిప్రాయాలకు విలువ ఇవ్వరు. మీ తీరు మారకపోతే కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లేదు. అలా చేస్తున్నప్పుడు మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

కర్కాటక రాశి 
మీరు మీ మనస్సును అదుపులో పెట్టుకుని ప్రయత్నిస్తే అసాధ్యమనేది ఉండదు. చుట్టూ ఉన్నవారు కొందరు మిమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తారు. మరియు పనులు చేయగల మీ సామర్థ్యాన్ని ప్రశ్నించవచ్చు. వారికి మీరేంటో చేసి నిరూపించండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు వాటిని సాధ్యమైనంత ప్రభావవంతంగా సాధించండి.

సింహ రాశి
నేడు మీరు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మీరు ఎక్కడికి వెళుతున్నారో తెలియక కొంతకాలంగా ఏదో కోల్పోయినట్లు భావిస్తున్నారు. నేడు మీకు ఆ విషయంపై స్పష్టత వస్తుంది. మీకు ఏమి కావాలో మరియు ఎలా చేయాలో మీరు గ్రహిస్తారు. మీరు చాలా సంతోషకరమైన మరియు ప్రశాంతమైన మనస్సుతో ఉంటారు. వ్యాపారాలతో పరిస్థితులు చక్కదిద్దుతారు.

Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా 

కన్య రాశి
మీ చుట్టూ ఉన్న ఎవరైనా సలహా కోసం మీ వద్దకు వస్తారు. అయితే మీరు వారికి సరైన సలహా ఇచ్చి పంపిస్తారు. ఇతరులతో కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించడం అవసరం, కానీ మీరు దీన్ని వినయంగా చేస్తున్నారని నిర్ధారించుకోండి, కాబట్టి మీరు ప్రక్రియలో ఎవరినీ బాధపెట్టకూడదు. ఉద్యోగులు, వ్యాపారులకు పనిలో ఒత్తిడి అధికం కానుంది. కుటుంబసభ్యులతో విభేదాలు తలెత్తుతాయి.

తులా రాశి
మీ రహస్య ప్రవర్తనను ఈ రోజు మీ స్నేహితులు గమనిస్తారు.  మీరు వారికి అన్ని విషయాలు చెప్పడం లేదని మరియు కొన్ని విషయాలను దాచిపెట్టారని వారు భావిస్తారు. అయినప్పటికీ, వారు ఎల్లప్పుడూ మీకు ప్రతిదీ చెబుతున్నారు. అవసరమైతే కొన్ని రహస్యాలు పంచుకోండి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

వృశ్చిక రాశి
మీరు నిర్వహించడానికి చాలా కష్టంగా ఉండే పరిస్థితి ఎదురవుతుంది. అయితే, మీ పరిస్థితి పట్ల సరైన అవగాహనతో మీరు నిర్ణయానికి వస్తారు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు చింతించకండి. పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రశాంతంగా ఆలోచించండి, మీ పనులను ప్లాన్ చేసి ముందుకు సాగితే మీరు విజయవంతం అవుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ పలితాలు గోచరిస్తున్నాయి.

ధనుస్సు రాశి
మీరు మార్పులేని జీవితాన్ని గడుపుతున్నారని మీకు అనిపిస్తే నేడు కోరుకున్న మార్పు లభిస్తుంది. మీ ముందు ఉంచిన అన్ని సమస్యలను మీరు పరిష్కరిస్తారు. మీ కార్యాలయంలో మీకు నూతన మరియు ఉత్తేజకరమైన పరిస్థితి ఏర్పడుతుంది.  కొన్ని ఆహ్వానాలు అందుకుని శుభకార్యాలలో పాల్గొంటారు. 

మకర రాశి
మీకు మీరే స్ఫూర్తి, ప్రేరణగా ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తాయి. మీ మీద కొంత నమ్మకం ఉంచండి. మీరు కష్టపడి పనిచేసేవారు మరియు చుట్టూ ఉన్న తెలివైన వారిలో ఒకరు. ఇతరులు మీతో సంతోషంగా లేరని అనుకోవడం మానేయండి, ఎందుకంటే మిమ్మల్ని విమర్శించే వారు మీ చుట్టుపక్కల లేరు. వ్యాపారుల సమస్యలు తొలగిపోతాయి.

కుంభ రాశి
మీ జీవితంలో ప్రతిదీ చాలా వేగంగా మరియు చాలా త్వరగా జరుగుతోంది. అది ఎందుకు జరిగిందని తెలుసుకునేందుకు మీకు కాస్త సమయం అవసరం. మీరు చేయవలసిన పనుల జాబితా నుండి కొన్ని పనులను తొలగిస్తారు. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం పొందలేరు.

మీన రాశి
ఈ రోజు చాలా ప్రశ్నలు మిమ్మల్ని వేధించనున్నాయి. మీరు వాటికి సమాధానం చెప్పడానికి తీవ్రంగా యోచించాల్సి వస్తుంది. మీ మనస్సు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ నుండి సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏ భయాలు అక్కర్లేదు. ఆకస్మిక ధనవ్యయం ఇబ్బంది పెడుతుంది. ప్రయాణాల కారణంగా రుణయత్నాలు చేస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News